Share News

IND vs SA: మూడో టీ20ని కూడా వర్షం అడ్డుకుంటుందా? వెదర్ రిపోర్టు ఎలా ఉందంటే..?

ABN , Publish Date - Dec 14 , 2023 | 11:21 AM

IND vs SA 3rd T20I Weather Report: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో కీలకమైన మూడో మ్యాచ్‌కు టీమిండియా సిద్ధమైంది. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఓడిన సంగతి తెలిసిందే. దీంతో 0-1తో భారత జట్టు సిరీస్‌లో వెనుకబడింది.

IND vs SA: మూడో టీ20ని కూడా వర్షం అడ్డుకుంటుందా? వెదర్ రిపోర్టు ఎలా ఉందంటే..?

జోహన్నెస్‌బర్గ్: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో కీలకమైన మూడో మ్యాచ్‌కు టీమిండియా సిద్ధమైంది. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఓడిన సంగతి తెలిసిందే. దీంతో 0-1తో భారత జట్టు సిరీస్‌లో వెనుకబడింది. మూడో మ్యాచ్‌లోనూ ఓడితే సిరీస్ చేజారుతుంది. దీంతో గురువారం జరిగే మూడో టీ20 మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్ సమం చేయాలని భారత జట్టు పట్టుదలగా ఉంది. అయితే టీమిండియా అభిమానులను వరుణుడు కంగారుపెడుతున్నాడు. వర్షం కారణంగా మొదటి మ్యాచ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. రెండో మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్ మరో 3 బంతులు మిగిలి ఉండగానే వర్షం వచ్చింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో సౌతాఫ్రికా లక్ష్యాన్ని 15 ఓవర్లలో 151 పరుగులుగా నిర్దేశించారు. వర్షం తర్వాత బ్యాటింగ్ చేయడం సౌతాఫ్రికాకు సానుకూలాంశంగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీంతో సఫారీలు సునాయసంగా లక్ష్యాన్ని చేధించారు.


ఈ నేపథ్యంలో గురువారం జరిగే కీలకమైన మూడో టీ20 మ్యాచ్‌కు కూడా వర్షం అడ్డుపడితే పరిస్థితి ఏంటనే ఆందోళన టీమిండియా అభిమానుల్లో నెలకొంది. అయితే అభిమానులు అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్థానిక వాతావరణ నివేదిక ప్రకారం జోహన్నెస్‌బర్గ్‌లో మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. సాయంత్రం వర్షం పడే అవకాశాలునప్పటికీ మ్యాచ్ సమయానికి వాతావరణం సాధారణంగా ఉండొచ్చు. జోహన్నెస్‌బర్గ్‌లో గురువారం పగటి ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్‌గా ఉండనుంది. మ్యాచ్ ప్రారంభం సమయంలో 26 డిగ్రీల సెల్సియస్‌గా.. రెండో ఇన్నింగ్స్ సమయంలో 20 డిగ్రీల సెల్సియస్‌గా ఉండనుంది. దీంతో పూర్తి మ్యాచ్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

Updated Date - Dec 14 , 2023 | 11:21 AM