వరల్డ్‌కప్‌లో టీమిండియా వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ ఫిక్స్? మరి సంజూ శాంసన్ పరిస్థితేంటి..?
ABN , First Publish Date - 2023-07-30T21:38:04+05:30 IST
వన్డే ప్రపంచకప్‌నకు రోజులు దగ్గర పడుతుండడంతో టీమిండియా స్క్వాడ్ ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ పెరిగిపోతుంది. ముఖ్యంగా ఈ మేజర్ టోర్నీలో టీమిండియా వికెట్ కీపర్‌గా ఎవరు ఉంటారనే దానిపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ రేసులో ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ ఉన్నారు.
వన్డే ప్రపంచకప్‌నకు రోజులు దగ్గర పడుతుండడంతో టీమిండియా స్క్వాడ్ ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ పెరిగిపోతుంది. ముఖ్యంగా ఈ మేజర్ టోర్నీలో టీమిండియా వికెట్ కీపర్‌గా ఎవరు ఉంటారనే దానిపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ రేసులో ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ ఉన్నారు. నిజానికి వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ ఉంటాడని అంతా భావించారు. కానీ దురదృష్టవశాత్తూ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో అతను ఈ ఏడాది మైదానంలోకి దిగే అవకాశాలు కనిపించడంలేదు. ఇక రేసులో ఉన్న కిషన్, శాంసన్‌లలో ఒక్కరికే టీమిండియాలో చోటు దక్కే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి ఈ రేసులో శాంసన్ కంటే కిషన్‌కే మెరుగైన అవకాశాలున్నాయి. ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉన్న కిషన్ తొలి రెండు వన్డేల్లో హాఫ్ సెంచరీలు కొట్టాడు. అంతకుముందు రెండో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా మెరుపు హాఫ్ సెంచరీ బాదాడు. దీంతో ఆసియాకప్‌నకు కిషన్ ఎంపిక కావడం ఖాయమనే చెప్పుకోవాలి. అక్కడ కూడా రాణిస్తే ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో అవకాశం దక్కుతుంది. ఇక ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడే జట్టే ప్రపంచకప్‌లోనూ బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పైగా లెఫ్ట్ బ్యాటర్ కావడం కిషన్‌కు కలిసి రానుంది. ఎందుకంటే ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ ఒక్కరు కూడా లేదు. ఆల్‌రౌండర్ జడేజా ఉన్నప్పటికీ అతను 6 లేదా 7వ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు. ఇక ఇప్పటివరకు 16 వన్డేలు ఆడిన కిషన్ 44 సగటుతో 617 పరుగులు చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ ఉంది.
సంజూ శాంసన్ విషయానికొస్తే ప్రస్తుతం భారత జట్టులో ఉన్నప్పటికీ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. రెండో వన్డేలో అవకాశం వచ్చినప్పటికీ సత్తా చాటలేకపోయాడు. మూడో వన్డేకు రోహిత్, కోహ్లీ జట్టులో చేరే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో సంజూకు స్థానం కష్టమనే చెప్పుకోవాలి. తర్వాత విండీస్‌తో ఆడే టీ20 జట్టులో కిషన్‌తోపాటు శాంసన్ కూడా ఉన్నాడు. అక్కడ రాణిస్తే మళ్లీ వన్డే జట్టులోకి వచ్చే అవకాశాలుంటాయి. ఇప్పటివరకు 12 వన్డేలు ఆడిన శాంసన్ 56 సగటుతో 339 పరుగులు చేశాడు. రెండు హాఫ్ సెంచరీలున్నాయి. ఒకవేళ ఆసియాకప్‌నకు ఎంపికైనప్పటికీ శాంసన్‌కు తుది జట్టులో చోటు కష్టమని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఆసియా కప్‌లో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఆడనున్నారని సమాచారం. అవసరమైతే కిషన్‌ను కూడా పక్కనపెట్టొచ్చు. అప్పుడు రాహుల్ వికెట్ కీపింగ్ బాధ్యతలను చేపడతాడు. పార్ట్ టైమ్ కీపరైనా రాహుల్ గతంలోనూ అనేక మ్యాచ్‌ల్లో వికెట్ కీపింగ్ చేశాడు. ప్రపంచకప్‌లోనూ టీమిండియా వికెట్ కీపర్‌గా రాహులే వ్యవహరించే అవకాశాలు లేకపోలేదు. బ్యాటర్‌గా రాహుల్‌కు కావాల్సినంత అనుభవం కూడా ఉంది. అప్పుడు కిషన్ టీంలో ఉన్నప్పటికీ తుది జట్టులో చోటు కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే గాయాల నుంచి కోలుకుని ఆటగాళ్లంతా జట్టులో చేరితో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ రోహిత్, గిల్, కోహ్లీ, శ్రేయస్, రాహుల్, హార్దిక్, జడేజాలతో ఉండే అవకాశాలుంటాయి. మొత్తానికి ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే వన్డే ప్రపంచకప్‌నకు టీమిండియా ప్రధాన వికెట్ కీపర్‌గా కిషన్‌ను ఎంపిక చేసే అవకాశాలున్నాయి.