Share News

Birthday: ఒకరు కాదు, ఇద్దరు కాదు నేడు నలుగురు టీమిండియా స్టార్ క్రికెటర్ల బర్త్‌ డే!

ABN , First Publish Date - 2023-12-06T12:31:16+05:30 IST

నేడు ఒకే రోజు టీమిండియా నలుగురు స్టార్ క్రికెటర్లు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. టీమిండియా పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా, స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.

Birthday: ఒకరు కాదు, ఇద్దరు కాదు నేడు నలుగురు టీమిండియా స్టార్ క్రికెటర్ల బర్త్‌ డే!

నేడు ఒకే రోజు టీమిండియా నలుగురు స్టార్ క్రికెటర్లు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. టీమిండియా పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా, స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. టీమిండియాకు చెందిన నలుగురు ఆటగాళ్లు ఒకే రోజు పుట్టిన రోజు జరుకుంటుండడం గమనార్హం. దీంతో వీరికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ట్విట్టర్ వేదికగా బీసీసీఐ పోస్టులు పెట్టింది. తోటి క్రికెటర్లతోపాటు అభిమానులు కూడా వీరికి పుట్టిన రోజు శుభకాంక్షలు చెబుతున్నారు. పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా 1993 డిసెంబర్ 6న జన్మించాడు. దీంతో నేటితో 31వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 1988 డిసెంబర్ 6న జన్మించాడు. జడ్డూ భాయ్ నేటితో 36వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు. మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ 1994 డిసెంబర్ 6న జన్మించాడు. దీంతో నేటితో అయ్యర్ 29వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ఇక మాజీ పేసర్ ఆర్పీ సింగ్ 1985 డిసెంబర్ 6న జన్మించాడు. దీంతో నేటితో ఆర్పీ సింగ్ 39వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు.


తన కెరీర్‌లో ఇప్పటివరకు 30 టెస్టు మ్యాచ్‌లాడిన పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా 128 వికెట్లు తీశాడు. ఇక 89 వన్డేల్లో 149 వికెట్లు, 62 టీ20ల్లో 74 వికెట్లు తీశాడు. ప్రస్తుతం టీమిండియాలో కీలక బౌలర్‌గా ఉన్న బుమ్రా సౌతాఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా కూడా ఎంపికయ్యాడు. తన కెరీర్‌లో 67 టెస్టు మ్యాచ్‌లాడిన రవీంద్ర జడేజా 36 సగటుతో 2804 పరుగులు చేశాడు. 3 సెంచరీలు, 19 హాఫ్ సెంచరీలు చేశాడు. వన్డేల్లో 32 సగటుతో 2756 పరుగులు, టీ20ల్లో 24 సగటుతో 457 పరుగులు చేశాడు. వన్డేల్లో 13 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇక బౌలింగ్‌లో టెస్టుల్లో 275 వికెట్లు, వన్డేల్లో 220 వికెట్లు, టీ20ల్లో 51 వికెట్లు తీశాడు. తన కెరీర్‌లో 10 టెస్టులు మ్యాచ్‌లాడిన శ్రేయస్ అయ్యర్ 44 సగటుతో 666 పరుగులు చేశాడు. ఓ సెంచరీ, 5 హాఫ్ సెంచరీలున్నాయి. 58 వన్డేల్లో 49 సగటుతో 2331 పరుగులు చేశాడు. 5 సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలున్నాయి. 51 టీ20ల్లో 30 సగటుతో 1104 పరుగులు చేశాడు. 8 హాఫ్ సెంచరీలున్నాయి. ఇక ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆర్పీ సింగ్ కెరీర్‌లో 14 టెస్టులు, 58 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 40 వికెట్లు, వన్డేల్లో 69 వికెట్లు, టీ20ల్లో 15 వికెట్లు తీశాడు. గాయాలు, ఫామ్ లేమితో సతమతమైన ఆర్పీ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. కాగా టీమిండియా గెలిచిన 2007 టీ20 ప్రపంచకప్ జట్టులో ఆర్పీ సింగ్ కూడా సభ్యుడిగా ఉన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-06T12:46:48+05:30 IST