ODI World Cup 2023: హైదరాబాద్‌లో మస్తు ఎంజాయ్ చేస్తున్న పాకిస్థాన్ క్రికెటర్లు.. వీడియో ఇదిగో!

ABN , First Publish Date - 2023-10-01T13:34:41+05:30 IST

వన్డే ప్రపంచకప్ కోసం హైదరాబాద్ వచ్చిన పాకిస్థాన్ క్రికెటర్లు ఖాళీ సమయాల్లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ అభిమానులు చూపిస్తున్న అభిమానానికి పాకిస్థాన్ ఆటగాళ్లు ఫిదా అవుతున్నారు.

ODI World Cup 2023: హైదరాబాద్‌లో మస్తు ఎంజాయ్ చేస్తున్న పాకిస్థాన్ క్రికెటర్లు.. వీడియో ఇదిగో!

హైదరాబాద్: వన్డే ప్రపంచకప్ కోసం హైదరాబాద్ వచ్చిన పాకిస్థాన్ క్రికెటర్లు ఖాళీ సమయాల్లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ అభిమానులు చూపిస్తున్న అభిమానానికి పాకిస్థాన్ ఆటగాళ్లు ఫిదా అవుతున్నారు. అలాగే హైదరాబాద్‌లో తమకు లభిస్తున్న అద్భుతమైన అతిథ్యం పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఖాళీ సమయాల్లో విందు విలాసాలతో సంతోషంగా గడిపేస్తున్నారు. న్యూజిలాండ్‌తో వామప్ మ్యాచ్ ముగిసిన తర్వాత పాకిస్థాన్ జట్టు విందుకు ఓ ఖరీదైన హోటల్‌కు వెళ్లింది. అక్కడ విలాసవంతమైన విందును పాకిస్థాన్ ఆటగాళ్లు ఆస్వాదించారు. అనతరం అక్కడికి వచ్చిన అభిమానులకు సెల్ఫీలు కూడా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేయగా నెట్టింట వైరల్‌గా మారింది. దానికి హైదరాబాద్‌లోని హ్యాంగ్‌అవుట్ అని ట్వీట్ చేసింది. వైరలైన వీడియోలో ఆటగాళ్లంతా బస్సులో ఓ ఖరీదైన హోటల్‌కు వెళ్లడం కనిపించింది. అక్కడ వారికి హోటల్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికింది. హోటల్ వాతావరణంలో సరదాగా గడిపిన పాకిస్థాన్ ఆటగాళ్లు ఆ తర్వాత అందరూ కలిసి డిన్నర్ చేశారు. అనంతరం అభిమానులతో కలిసి సెల్పీలు దిగారు. కాగా పాకిస్థాన్ ఆటగాళ్లు హైదరాబాద్‌లో అడుగుపెట్టిన సమయంలోనూ అభిమానులు భారీ ఎత్తును విమానాశ్రయానికి చేరుకుని వారికి స్వాగతం పలికారు. భారతీయుల అభిమానానికి పొంగిపోయిన పాకిస్థాన్ ఆటగాళ్లు ప్రశంసలు కురిపించారు.


ఇక హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన వామప్ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 345 పరుగుల భారీ స్కోర్ చేసింది. పాక్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్ (103), బాబర్ అజామ్ (80), సౌద్ షకీల్ (75) రాణించారు. కానీ న్యూజిలాండ్ జట్టు 43.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని విజయం సాధించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర (97), కేన్ విలియమ్సన్ (54), డారిల్ మిచెల్ (59), మార్క్ చాప్‌మన్ (65)లు రాణించారు. ఇక వన్డే ప్రపంచకప్ టోర్నీలోని రెండు మ్యాచ్‌లను పాక్ జట్టు హైదరాబాద్‌లోనే ఆడనుంది. అక్టోబర్ 6న నెదర్లాండ్స్‌తో, 10న శ్రీలంకతో ఆడనుంది. గుజరాత్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా భారత్, పాకిస్థాన్ జట్లు అక్టోబర్ 14న తలపడనున్నాయి.

Updated Date - 2023-10-01T13:34:41+05:30 IST