40 years of India’s 1983 World Cup: ఆల్‌రౌండర్లు కీ రోల్.. టీమిండియా ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనల లిస్ట్ ఇదిగో!
ABN , First Publish Date - 2023-06-25T14:22:06+05:30 IST
భారత క్రికెట్ జట్టు 1983 ప్రపంచకప్ గెలిచి నేటికి సరిగ్గా 40 సంవత్సరాలు పూర్తయ్యాయి. దీంతో భారత క్రికెట్ అభిమానులంతా ఆ మధురానుభుతులను ఒకసారి నెమరువేసుకుంటున్నారు. నాటి విజయం ఏ ఒక్కరి వల్లనో దక్కింది కాదు. నాటి ప్రపంచకప్ విజయంలో టీంలోని ఆటగాళ్లంతా కీలకపాత్ర పోషించారు. అయితే నాటి ప్రపంచకప్ ఆడిన భారత జట్టులో మొత్తం ఎంత మంది ఆటగాళ్లు ఉన్నారు? ఎవరెవరు ఉన్నారు? ఎవరు ఎలా ఆడారు.? ఏ బ్యాటర్ ఎన్ని రన్స్ కొట్టాడు? ఏ బౌలర్ ఎన్ని వికెట్లు తీశాడు? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
భారత క్రికెట్ జట్టు 1983 ప్రపంచకప్ గెలిచి నేటికి సరిగ్గా 40 సంవత్సరాలు పూర్తయ్యాయి. దీంతో భారత క్రికెట్ అభిమానులంతా ఆ మధురానుభుతులను ఒకసారి నెమరువేసుకుంటున్నారు. నాటి విజయం ఏ ఒక్కరి వల్లనో దక్కింది కాదు. నాటి ప్రపంచకప్ విజయంలో టీంలోని ఆటగాళ్లంతా కీలకపాత్ర పోషించారు. అయితే నాటి ప్రపంచకప్ ఆడిన భారత జట్టులో మొత్తం ఎంత మంది ఆటగాళ్లు ఉన్నారు? ఎవరెవరు ఉన్నారు? ఎవరు ఎలా ఆడారు.? ఏ బ్యాటర్ ఎన్ని రన్స్ కొట్టాడు? ఏ బౌలర్ ఎన్ని వికెట్లు తీశాడు? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టీమిండియా స్క్వాడ్
నాటి ప్రపంచకప్‌లో పాల్గొనడానికి భారత జట్టు మొత్తం 14 మంది ఆటగాళ్ల స్క్వాడ్‌తో ఇంగ్లండ్‌లో అడుగుపెట్టింది. 14 మంది స్క్వాడ్‌లో కపిల్ దేవ్, రోజర్ బిన్నీ, సునీల్ గవాస్కర్, మొహిందర్ అమర్నాథ్, కృష్ణమాచారి శ్రీకాంత్, రవిశాస్త్రి, దిలీప్ వెంగ్‌సర్కార్, యష్‌పాల్ శర్మ, సయ్యద్ కిర్మాణి, బల్విందర్ సంధు, కీర్తి ఆజాద్, మదన్ లాల్, సందీప్ పాటిల్, సునీల్ వాల్సన్ ఉన్నారు.
టాపర్లు ఎవరంటే?..
నాటి ప్రపంచకప్ విజయంలో కెప్టెన్‌గా, ఆటగాడిగా కపిల్ దేవ్ కీలకపాత్ర పోషించాడు. ఆటగాడిగా బ్యాట్‌తో బాల్‌తో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేశాడు. ఈ క్రమంలో 1983 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఆ ప్రపంచకప్‌లో భారత్ జట్టు ఆడిన మొత్తం 8 మ్యాచ్‌లో 60 సగటుతో కపిల్ దేవ్ 303 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 175 నాటౌట్. ఇక బౌలింగ్‌లోనూ అదరగొట్టిన కపిల్ 12 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ గణాంకాలు 5/43. కపిల్ దేవ్ తర్వాత భారత జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా యష్‌పాల్ శర్మ నిలిచాడు. యష్‌పాల్ 8 మ్యాచ్‌ల్లో 34 సగటుతో 240 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 89. ఆ తర్వాత మొహిందర్ అమర్నాథ్ 8 మ్యాచ్‌ల్లో 29 సగటుతో 237 పరుగులు చేశాడు అమర్నాథ్. అత్యధిక స్కోర్ 80. బాల్‌తోనూ అదరగొట్టిన అమర్నాథ్ 8 వికెట్లు పడగొట్టాడు. సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌ల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అమర్నాథ్‌కే దక్కాయంటేనే ప్రపంచకప్‌లో అతను ఏ స్థాయిలో చెలరేగాడో అర్థం చేసుకోవచ్చు. 8 మ్యాచ్‌లాడిన మరో బ్యాటర్ సందీప్ పాటిల్ 30 సగటుతో 216 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 51 నాటౌట్.
అత్యధిక వికెట్లు తీసిందెవరంటే?..
1983 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రోజర్ బిన్నీ నిలిచాడు. 8 మ్యాచ్‌ల్లో ఏకంగా 17 వికెట్లు పడగొట్టాడు బిన్నీ. అత్యుత్తమ గణాంకాలు 4/29. కీలక సమయాల్లో బ్యాట్‌తో కూడా బిన్నీ రాణించాడు. 12 సగటుతో 73 పరుగులు చేశాడు. ఆల్‌రౌండ్ పాత్ర పోషించిన మరో ఆటగాడు మదన్ లాల్. బ్యాటింగ్‌లో మదన్ లాల్ 8 మ్యాచ్‌ల్లో 34 సగటుతో 102 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో ఏకంగా 17 వికెట్లు తీసి.. భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రోజర్ బిన్నీతో కలిసి సమంగా ఉన్నాడు. అత్యుత్తమ గణాంకాలు 4/20.
తెలుగోడి రన్స్ ఎన్నంటే?..
8 మ్యాచ్‌లాడిన తెలుగు ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్ 19 సగటుతో 156 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 39 పరుగులు. కాగా ఈ ప్రపంచకప్‌లో శ్రీకాంత్ ఓపెనర్‌గా ఆడాడు. ఈ ప్రపంచకప్‌లో టీమిండియా వికెట్ కీపర్‌గా సయ్యద్ కిర్మాణి వ్యవహరించాడు. వికెట్ కీపర్‌గా టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. తన కీపింగ్‌తో 14 మంది బ్యాటర్లను ఔట్ చేయడంలో భాగస్వామి అయ్యాడు. 12 మందిని క్యాచ్ ఔట్‌ల రూపంలో ఔట్ చేయగా.. ఇద్దరిని స్టంపౌట్ చేశాడు. ఇక 8 మ్యాచ్‌లాడిన బౌలర్ బల్విందర్ సంధు 8 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ గణాంకాలు 2/26.
ఆల్‌రౌండర్లు కీలకపాత్ర
5 మ్యాచ్‌లాడిన రవిశాస్త్రి 10 సగటుతో 40 పరుగులు.. 2 మ్యాచ్‌లాడిన దిలీప్ వెంగ్‌సర్కార్ 37 పరుగులు..3 మ్యాచ్‌లాడిన బౌలర్ కీర్తి ఆజాద్ ఒక వికెట్ తీశాడు. 6 మ్యాచ్‌లాడిన సునీల్ గవాస్కర్ 59 పరుగులు చేశాడు. గాయం కారణంగా సన్నీ రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. కాగా ప్రపంచకప్ మొత్తం జట్టుతోనే ఉన్నప్పటికీ ఒకసారి కూడా తుది జట్టులో చోటు దక్కని ఆటగాడు కూడా ఉన్నాడు. అతనే సునీల్ వాల్సన్. సునీల్ వాల్సన్ మంచి పేస్ బౌలర్ అయినప్పటికీ.. రోజర్ బిన్నీ, కపిల్ దేవ్, బల్వీందర్ సంధులతో కూడిన స్టార్ బౌలర్లు ఉండడంతో తుది జట్టులో ఒకసారి కూడా అవకాశం రాలేదు. మొత్తంగా ఈ ప్రపంచకప్ టీంను పరిశీలిస్తే భారత్ విజయంలో ఆల్‌రౌండర్లు కీలకపాత్ర పోషించారు. ఆల్‌రౌండర్లు కపిల్ దేవ్, రోజర్ బిన్నీ, మదన్ లాల్, అమర్నాథ్ ఈ టోర్నీలో దుమ్ములేపారు.