Viral Video: రోడ్డు ప్రమాదం తర్వాత తొలి సారి బ్యాటింగ్ చేసిన రిషబ్ పంత్.. సిక్సర్లతో విరుచుకుపడ్డాడుగా..
ABN , First Publish Date - 2023-08-16T21:56:19+05:30 IST
టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం తర్వాత తొలి సారి బ్యాట్ పట్టుకుని బరిలోకి దిగాడు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఓ టోర్నీలో బరిలోకి దిగిన పంత్.. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం తర్వాత తొలి సారి బ్యాట్ పట్టుకుని బరిలోకి దిగాడు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఓ టోర్నీలో బరిలోకి దిగిన పంత్.. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. భారీ సిక్సర్లు సైతం బాదాడు. పంత్ బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన టీమిండియా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. గాయం నుంచి పూర్తిగా కోలుకుని పంత్ త్వరలోనే టీమిండియాలోకి వస్తాడని ఆశిస్తున్నారు. కాగా 30 డిసెంబర్ 2022న జరిగిన రోడ్డు ప్రమాదంలో రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అప్పటి నుంచి క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. కాలికి శస్త్ర చికిత్స కూడా జరగడంతో దాదాపు 3 నెలలు మంచానికే పరిమితయ్యాడు. ఆ తర్వాతి నుంచి బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పంత్ కోలుకుంటున్నాడు.
కాగా రిషబ్ పంత్ వచ్చే ఏడాది ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్ ద్వారా టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు ప్రస్తుతం ఎన్సీఏలోనే ఉన్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నట్లు సమాచారం. దీంతో ఆసియా కప్‌లో బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తుంది. కాగా ఆసియా కప్‌లో బరిలోకి దిగే భారత జట్టును సెలెక్టర్లు త్వరలోనే ప్రకటించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఆసియా కప్‌లో బరిలోకి దిగే భారత జట్టే అక్టోబర్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌లోనూ బరిలోకి దిగే అవకాశాలున్నాయి. దీంతో ఆసియా కప్‌నకు ప్రకటించే జట్టు ఎలా ఉండబోతుందోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.