Asia Cup 2023: ఆసియా కప్‌లో సచిన్ రికార్డును బద్దలు కొట్టనున్న విరాట్ కోహ్లీ

ABN , First Publish Date - 2023-08-30T16:33:21+05:30 IST

బుధవారం నుంచి ప్రారంభమైన ఆసియా కప్ 2023లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్‌కు చెందిన ఓ రికార్డును బద్దలు కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Asia Cup 2023: ఆసియా కప్‌లో సచిన్ రికార్డును బద్దలు కొట్టనున్న విరాట్ కోహ్లీ

బుధవారం నుంచి ప్రారంభమైన ఆసియా కప్ 2023లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్‌కు చెందిన ఓ రికార్డును బద్దలు కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తన కెరీర్‌లో ఇప్పటివరకు 275 వన్డే మ్యాచ్‌లాడిన కింగ్ కోహ్లీ 265 ఇన్నింగ్స్‌లో 12,898 పరుగులు చేశారు. మరో 102 పరుగులు చేస్తే వన్డే క్రికెట్‌లో 13 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. ఈ క్రమంలో వన్డేల్లో అత్యంత వేగంగా 13 వేల పరుగులు చేసిన బ్యాటర్‌గా సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లీ బ్రేక్ చేస్తాడు. తన వన్డే కెరీర్‌లో సచిన్ 321 ఇన్నింగ్స్‌ల్లో 13 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ ఇప్పటివరకు 265 మ్యాచ్‌లే ఆడాడు. ఆసియా కప్‌లో భారత జట్టు కనీసం 5 మ్యాచ్‌లైనా ఆడుతుంది. దీంతో 102 పరుగులు చేయడం కోహ్లీకి పెదగా కష్టమేమి కాదు. దీంతో ఈ ఆసియా కప్‌లో సచిన్‌ను అధిగమించి వన్డేల్లో అత్యంత వేగంగా 13 వేల పరుగులు చేసిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించనున్నాడు.


ఇక ఆసియా కప్‌లో భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 2న పాకిస్థాన్‌తో ఆడనుంది. ఇప్పటికే ఆసియా కప్‌ టోర్నీని అత్యధిక సార్లు గెలిచిన రికార్డు భారత్ పేరు మీదనే ఉంది. ఈ సారి కూడా ట్రోఫిని గెలిచి తమ రికార్డును మరింత మెరుగుపరచుకోవాలని టీమిండియా భావిస్తోంది. కాగా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ఆసియా కప్‌లో టీమిండియా ఆడే తొలి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

టీమిండియా ఆసియాకప్ స్క్వాడ్

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

Updated Date - 2023-08-30T16:34:41+05:30 IST