Share News

IND vs SA: భారత్ vs సౌతాఫ్రికా టీ20 సిరీస్‌ను ఫ్రీగా ఎక్కడ చూడాలో తెలుసా?

ABN , First Publish Date - 2023-12-10T07:32:51+05:30 IST

India vs South Africa: నేటి నుంచి భారత్, సౌతాఫ్రికా టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. ఆస్ట్రేలియాపై 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో గెలిచిన జోరు మీదున్న టీమిండియా సౌతాఫ్రికాను కూడా ఓడించాలని పట్టుదలగా ఉంది. సౌతాఫ్రికా వేదికగా జరిగే ఈ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో నేడు గెలిచి శుభారంభం చేయాలని భారత జట్టు భావిస్తోంది.

IND vs SA: భారత్ vs సౌతాఫ్రికా టీ20 సిరీస్‌ను ఫ్రీగా ఎక్కడ చూడాలో తెలుసా?

డర్బన్: నేటి నుంచి భారత్, సౌతాఫ్రికా టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. ఆస్ట్రేలియాపై 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో గెలిచిన జోరు మీదున్న టీమిండియా సౌతాఫ్రికాను కూడా ఓడించాలని పట్టుదలగా ఉంది. సౌతాఫ్రికా వేదికగా జరిగే ఈ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో నేడు గెలిచి శుభారంభం చేయాలని భారత జట్టు భావిస్తోంది. రెండో టీ20 మ్యాచ్ ఈ నెల 12న, మూడో టీ20 మ్యాచ్ 14న జరగనుంది. కెప్టెన్లు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఇంకా జట్టులో చేరకపోవడంతో ఈ సిరీస్‌కు కూడా సూర్యకుమార్ యాదవే భారత జట్టును నడిపించనున్నాడు. సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా కూడా ఈ సిరీస్‌లో ఆడడం లేదు. ఆస్ట్రేలియాతో టీ20లకు దూరంగా ఉన్న శుభ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఈ సిరీస్‌లో బరిలోకి దిగుతున్నారు. మొదటి టీ20 మ్యాచ్ నేడు డర్బన్ వేదికగా జరగనుంది.


కాగా భారత్, సౌతాఫ్రికా టీ20 సిరీస్‌ను ఉచితంగా టీవీల్లో స్టార్ స్పోర్ట్స్ ఛానెల్, ఓటీటీలో డిస్నీ+హాట్‌స్టార్ ప్రసారం చేయనుంది. డిస్నీ+హాట్‌స్టార్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో మొబైల్ వినియోగదారులు మాత్రమే మ్యాచ్‌లు ఉచితంగా చూడొచ్చు. డిస్నీ+హాట్‌స్టార్ ద్వారా ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, టీవీల్లో మ్యాచ్‌లు చూడాలంటే సబ్స్‌క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి టీ20 మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుండగా.. రెండు, మూడో టీ20 మ్యాచ్‌లు రాత్రి 8:30 గంటలకు ప్రారంభంకానున్నాయి.

టీమిండియా టీ20 స్క్వాడ్

యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ముఖేష్ కుమార్, వాషింగ్టన్ సుందర్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, కుల్దీప్ యాదవ్

Updated Date - 2023-12-10T07:32:58+05:30 IST