Kunamaneni Sambashiavaro: మునుగోడు ఎన్నికల్లో ఓటమితోనే బీజేపీ గ్రాఫ్ పడిపోయింది

ABN , First Publish Date - 2023-07-05T16:20:21+05:30 IST

మునుగోడు ఎన్నికల్లో ఓటమితోనే బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.

Kunamaneni Sambashiavaro: మునుగోడు ఎన్నికల్లో ఓటమితోనే బీజేపీ గ్రాఫ్ పడిపోయింది

మంచిర్యాల: మునుగోడు ఎన్నికల్లో ఓటమితోనే బీజేపీ (BJP) గ్రాఫ్ పడిపోయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు (CPI Leader Kunamneni Sambashiavarao)అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... త్వరలో జరగబోయే నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లోనూ బీజేపీ ఓటమి ఖాయమని స్పష్టం చేశారు. ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తామన్నారు. కేంద్రానికి చిత్త శుద్ధి ఉంటే కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడంతో పాటు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల మార్పు, త్రిపుల్ తలాక్ వంటి విధానాలను తీసుకువచ్చి దేశాన్ని విచ్ఛిన్నం చేసే దిశగా బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. పోడు భూముల సాధన కోసం పోరాటం చేసింది కమ్యూనిస్టులే అని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పోడు పట్టాలు ఇవ్వడాన్ని సీపీఐ పార్టీగా స్వాగతిస్తున్నామని కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.

Updated Date - 2023-07-05T16:20:21+05:30 IST