Minister Seethakka: ‘నన్ను అలా పిలవొద్దు’.. మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Dec 28 , 2023 | 02:50 PM
Telangana: జిల్లాలోని జైనథ్ మండలం జామినిలో ప్రజా పాలన కార్యక్రమాన్ని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నన్ను మేడం అని పిలవొద్దు. సీతక్క అని పిలవండి. మేడం... మేడం అంటే దూరం అయిపోతము’’...
ఆదిలాబాద్: జిల్లాలోని జైనథ్ మండలం జామినిలో ప్రజా పాలన కార్యక్రమాన్ని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క (Minister Seethakka) ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నన్ను మేడం అని పిలవొద్దు. సీతక్క అని పిలవండి. మేడం... మేడం అంటే దూరం అయిపోతము. అదే గుర్తు పెట్టుకోండి. సీతక్క అంటేనే మీ అక్క, మీ చెల్లిలాగా కలిసి పోతాం. పదవులు శాశ్వతం కాదు.. విలువలు, మంచి పనులే శాశ్వతం. కాంగ్రెస్ పాలన అంటే గడీల పాలన కాదు, గల్లీ బిడ్డల పాలన. ప్రజలకు ఏ అవసరం ఉన్నా మాతో స్వేచ్చగా చెప్పుకోవచ్చు’’ అంటూ మంత్రి సీతక్క పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...