Mallikarjuna Kharge: ఆరు గ్యారేంటీలు బరాబర్ అమలు చేస్తాం.. వాటిపై తొలిరోజే నిర్ణయం
ABN , First Publish Date - 2023-11-17T13:52:20+05:30 IST
Telangana Elections: తెలంగాణ ప్రజల బాగు కోసమే కాంగ్రెస్ మేనిఫెస్టో అని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. శుక్రవారం 36 అంశాంలతో తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోను ఖర్గే విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కేసీఆర్ సర్కార్ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రజల బాగు కోసమే కాంగ్రెస్ మేనిఫెస్టో (Congress Manifesto) అని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే (AICC Chief Mallikarjuna Kharge) స్పష్టం చేశారు. శుక్రవారం 36 అంశాంలతో తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోను ఖర్గే విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో (Kaleshwaram Project) కేసీఆర్ సర్కార్ (KCR Government) అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. కొద్ది రోజులుగా కేసీఆర్‌కు భయం పట్టుకుందని.. ఆయన గొంతులో ఆందోళన కనిపిస్తున్నదని ఆయన తెలిపారు.
మోదీ (PM Modi), కేసీఆర్ కలిసి ఎన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని.. జనాలు ఇప్పటికే డిసైడ్ అయిపోయారని చెప్పుకొచ్చారు. ఎప్పుడూ ఫార్మ్ హౌస్‌లోనే ఉండే కేసీఆర్ ఇక.. అక్కడే ఉండిపోతారని.. జనాలు బై బై కేసీఆర్.. టాటా కేసీఆర్ అంటారని అన్నారు. విద్యార్థులు, ఉద్యోగుల బలిదానాలు చూసి సోనియా తెలంగాణ ఇచ్చారని తెలిపారు. జనాలు బాగు పడతారని తెలంగాణ ఇస్తే.. జనాలను దోచుకునే వాళ్లు రాజ్యమేలుతున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టులు, పథకాలు, ప్రతి దాంట్లోనూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలను ఇచ్చినట్టే.. ఇక్కడా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని అన్నారు. కర్ణాటకలో చెప్పిన ప్రతి హామీనీ తాము నెరవేరుస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలను బరాబర్ అమలు చేసి తీరుతామని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేబినెట్ ఏర్పాటైన తొలి రోజే వాటిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ‘‘మా తొలి లక్ష్యం.. మహాలక్ష్మి పథకం.. ప్రతి నెలా రూ.2500, రూ.500కే గ్యాస్, బస్సుల్లో ఫ్ర్రీ జర్నీ’’ అని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి