TS BJP: ఎన్నికల ముందు బీజేపీకి మరో ఎదురుదెబ్బ.. కీలక నేత ఔట్!
ABN , First Publish Date - 2023-11-14T15:42:14+05:30 IST
కులాల పేరుతో ఈటల రాజేందర్ రాజకీయం చేయడం సరికాదని హితవు పలికారు. గత 6 నెలల్లో బీజేపీలో సమీకరణాలు మారాయన్నారు. కొత్త వాళ్లు పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీ కలుషితమైందని ఆరోపించారు.
మెదక్: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగాయిపల్లి గోపి ఆ పార్టీకి రాజీనామా చేశారు. నర్సాపూర్‌లో బీజేపీ అసమ్మతి నేతలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా గోపి మీడియాతో మాట్లాడారు. కులాల పేరుతో ఈటల రాజేందర్ రాజకీయం చేయడం సరికాదని హితవు పలికారు. గత 6 నెలల్లో బీజేపీలో సమీకరణాలు మారాయన్నారు. కొత్త వాళ్లు పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీ కలుషితమైందని ఆరోపించారు. కుట్ర పూరితంగానే బండి సంజయ్‌ను పార్టీలో నుంచి తప్పించడం జరిగిందని వ్యాఖ్యానించారు. పార్టీ కోసం కష్టపడే వారికి బీజేపీలో ప్రాధాన్యత లేదని వాపోయారు. భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయవలసిన పరిస్థితి వస్తాదని అనుకోలేదని ఆవేదన చెందారు. ఇప్పుడు బీజేపీలో తమకు గౌరవం లేదని వెల్లడించారు. తెలంగాణలో ఎమ్మెల్యే (MLA) సీట్లు అమ్ముడుపోతున్నాయని బీజేపీ అధిష్టానం గుర్తించాలని కోరారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కార్యకర్తల ఫోన్ ఎత్తే పరిస్థితుల్లో లేరని గోపి విమర్శించారు.
ఇదే రాజీనామా లేఖ..