Keshava Rao: రేపటిలోగా రైతు బంధు పడకపోతే..!
ABN , First Publish Date - 2023-11-27T16:41:55+05:30 IST
రైతు బంధును ఎలా ఆపుతారు. రాజకీయ నేతల్లో ఉన్న కోపతాపాలను రైతుల మీద రుద్దకూడదు. రైతు బంధును కాంగ్రెస్ వాళ్లు ఆపారని నేను అనడం లేదు.
హైదరాబాద్: రైతు బంధు ఆన్ గోయింగ్ స్కీమ్.. అలాంటిది ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఎలా ఆపుతారని బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు (Keshava Rao) ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. రైతుబంధు అనుమతి ఉపసంహరణ నేపథ్యంలో సీఈవో వికాస్‌రాజ్‌ను బీఆర్ఎస్ ప్రతినిధి బృందం కలిసింది. రైతు బంధకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కేశవరావు మీడియాతో మాట్లాడారు. ‘‘రైతు బంధు అనుమతి ఉపసంహరణపై సీఈవో వికాస్ రాజ్‌ను కలిశాం. రైతు బంధుపై మంత్రులు మాట్లాడితే వాళ్లకు నోటీసులు ఇవ్వండి. రైతు బంధును ఎలా ఆపుతారు. రాజకీయ నేతల్లో ఉన్న కోపతాపాలను రైతుల మీద రుద్దకూడదు. రైతు బంధును కాంగ్రెస్ వాళ్లు ఆపారని నేను అనడం లేదు. కేంద్ర ఎన్నికల సంఘంతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాం. కోర్టుకు వెళ్లేందుకు టైమ్ లేదు. రేపటి వరకు ప్రయత్నం చేస్తాం. లేదంటే రైతులు అర్థం చేసుకోవాలి.. రెండు, మూడు రోజులు ఓపిక పెట్టాలి.’’ అని కోరారు.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి