Telangana Elections: అభ్యర్థుల సడెన్ డెసిషెన్స్.. సంగారెడ్డిలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు
ABN , First Publish Date - 2023-11-10T13:53:48+05:30 IST
Telangana Elections: తెలంగాణలో నేటితో నామినేషన్ల పర్వం ముగియనుంది. నామినేషన్ల దాఖలుకు చివరి రోజున సంగారెడ్డి జిల్లాలో రాజకీయ పరిమాణాలు వేగంగా మారుతున్నాయి.
సంగారెడ్డి: తెలంగాణలో నేటితో నామినేషన్ల పర్వం (Nominations) ముగియనుంది. నామినేషన్ల దాఖలుకు చివరి రోజున సంగారెడ్డి జిల్లాలో రాజకీయ పరిమాణాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ పలువురు నేతలు తీసుకుంటున్న నిర్ణయాలు చర్చనీయాంశంగా మారాయి. నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ పార్టీలో సురేష్ షేట్కార్ (Suresh Shetkar) స్థానంలో సంజీవరెడ్డికి (Sanjeevreddy) పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చింది. అలాగే పటాన్‌చెరు కాంగ్రెస్‌లో నీలం మధు (Neelam Madhu) స్థానంలో కాట శ్రీనివాస్ గౌడ్‌కు (Kata Srinivas Goud) హైకమాండ్ టికెట్ కేటాయించింది. టికెట్ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నీలం మధు వెంటనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. వెను వెంటనే బీఎస్పీలో చేరిపోయారు. అలాగే సంగారెడ్డి బీజేపీలో ముందుగా పులిమామిడి రాజు ఖరారవగా.. చివరి నిమిషంలో టికెట్ రాజేశ్వరరావు దేశ్ పాండేకు (Rajeswara Rao Des Pandey) కేటాయించింది బీజేపీ అధిష్టానం. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా పులిమామిడి రాజు పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టికెట్ రాని నేతల అసంతృప్తితో వారు తీసుకుంటున్న నిర్ణయాలతో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి.