CM KCR: కాంగ్రెస్.. ధరణిని తీసేస్తే రైతు బంధు ఎలా సాధ్యం
ABN , First Publish Date - 2023-11-16T16:03:16+05:30 IST
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని ( Dharani ) తీసేస్తామని అంటుంది అలా అయితే రైతు బంధు ( RYTHU BANDHU ) ఎలా సాధ్యం అవుతుందని సీఎం కేసీఆర్ ( CM KCR ) ప్రశ్నించారు.గురువారం నాడు ఆదిలాబాద్‌లో ప్రజాఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడుతూ.. ధరణితో రైతుబంధు ఇస్తున్నాము. రైతులకు సకాలంలో అకౌంట్లలో పైసలు పడుతున్నాయని కేసీఆర్ తెలిపారు.
ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని ( Dharani ) తీసేస్తామని అంటుంది అలా అయితే రైతు బంధు ( RYTHU BANDHU ) ఎలా సాధ్యం అవుతుందని సీఎం కేసీఆర్ ( CM KCR ) ప్రశ్నించారు. గురువారం నాడు ఆదిలాబాద్‌లో నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. ‘‘ధరణితో రైతుబంధు ఇస్తున్నాము. రైతులకు సకాలంలో అకౌంట్లలో పైసలు పడుతున్నాయి. రైతు కష్టం తెలిసిన వాడిని నేను. ధరణితో ప్రజలకు అధికారం ఇచ్చాము. మీ భూమి హక్కును మార్చే శక్తి ముఖ్యమంత్రికి కూడలేదు. మీ బోటనవేలు ముద్ర పడితే భూమి మారుతుంది. ధరణి తీసివేస్తే లంచాల రాజ్యమే. రైతు బంధు కావాలన్నా.. కరెంట్ కావలన్నా బీఆర్ఎస్ పార్టీనే ఈ ఎన్నికల్లో గెలిపించాలి. కాంగ్రెస్ నేతలు చెప్పే మాయమాటలను నమ్మితే గోసపడుతాం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కావాలో.. బీఆర్ఎస్ పార్టీ కావాలో గ్రామాల్లో చర్చించండి. ఓటు వేసే ముందు ఆ పార్టీ చరిత్రను చూడాలి. ఎన్నికలల్లో ప్రజల గెలుపే నిజమైన ప్రజాస్వామ్యం. పేదల సంక్షేమం కోసం బీఆర్ఎస్‌నే గెలిపించాలి’’ అని పేర్కొన్నారు.
‘‘ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాము. 24 గంటల కరెంట్ ఇస్తున్నాము. దేశంలో ప్రజాస్వామ్య పరిణితి రాలేదు. ఓటు ఆయుధం.. ఈ ఆయుధాన్ని ఈ ఎన్నికల్లో జాగ్రత్తగా వాడాలి. అభ్యర్థులను చూసి ఆలోచించి ఓటు వేయాలి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మూడు గంటలే కరెంట్ ఇస్తామంటున్నారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చినా. కేంద్రప్రభుత్వం మెడికల్, నవోదయ కళాశాలలను ఒక్కటి కూడా ఇవ్వలేదు. బీజేపీకి ఈ ఎన్నికల్లో ఒక్క ఓటు వేయొద్దు. బీజేపీ పార్టీకి ఓటు వేస్తే మోరిలో వేసినట్లే. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఈ ఎన్నికల్లో మెజారిటీ రాదు. రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీల అధిపత్యం కొనసాగుతుంది’’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.