CM KCR : బీడీ కార్మికులకు ఆసరా ఫించన్ కట్ ఆఫ్ డేట్ ఎత్తివేస్తాం
ABN , First Publish Date - 2023-11-16T18:08:56+05:30 IST
బీడీ కార్మికులకు ఆసరా ఫించన్ కట్ ఆఫ్ డేట్ ఎత్తివేస్తామని సీఎం కేసీఆర్ ( CM KCR ) తెలిపారు. గురువారం నాడు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని డిచ్‌పల్లిలో ప్రజా ఆశీర్వదా సభ నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లా: బీడీ కార్మికులకు ఆసరా ఫించన్ కట్ ఆఫ్ డేట్ ఎత్తివేస్తామని సీఎం కేసీఆర్ ( CM KCR ) తెలిపారు. గురువారం నాడు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని డిచ్‌పల్లిలో ప్రజా ఆశీర్వదా సభ నిర్వహించారు. ఈ సభలో కేసీఆర్ పాల్గొని మాట్లాడుతూ.. ‘‘ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు మద్దతు ఇవ్వాలని రూరల్ ప్రజలను కేసీఆర్ కోరారు. దేశానికి 75 ఏళ్లు అయిన ప్రజాస్వామ్యం పరిణితి చెందలేదు. ఎన్నికల్లో ఆగం ఆగం కావొద్దు... బీఆర్ఎస్ అభ్యర్థి వెంట పార్టీ చరిత్ర ఉంటుంది. రాయి ఏదో, రత్నం ఏదో మీరు చర్చించుకోవాలి. తెలంగాణ స్వరాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు చేపట్టాం. ఆసరా, రైతు బీమా, రైతు బంధు అనేక పథకాలు అమలు చేశాం. సంపద పెరిగిన కొద్దీ సంక్షేమ కార్యక్రమాలు పెంచాము.తాగు, సాగు నీరుకు పన్నులు రద్దు చేశాం. రైతు బంధు పుట్టించిదే కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం. రైతుల పంటను ప్రభుత్వం కొట్టింది. రైతు మరణిస్తే రైతు బీమాతో 5 లక్షల రూపాయలతో ఆదుకుంటాం. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధు దుబారా అని అంటున్నాడు. కేసీఆర్ 24 గంటల గంటలు అనవసరంగా ఇస్తున్నాడని రేవంత్‌రెడ్డి అంటున్నాడు. ఈ ఎన్నికలల్లో ఆలోచించి ఓటు వేయాలి, ఈనాడు నాణ్యమైన కరెంటు వస్తుంది. ధరణి రద్దు చేస్తానని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అంటున్నారు. ధరణితో అధికారం రైతు బొటనవేలుకు ఇచ్చాం, ధరణితోనే రైతు బంధు సాధ్యం. ధరణిలోని సమస్యలను పరిష్కరిస్తాం. మంచినీళ్లు కూడా ఇవ్వని పార్టీల నేతలు ఇప్పుడు మాట్లాడుతున్నారు. కేసీఆర్ కిట్, అమ్మ ఒడి, కంటి వెలుగు వంటి పథకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. మా తండాలో మా రాజ్యం అని నియోజకవర్గంలో 50 గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశాం. మంచిప్ప రిజర్వాయర్ పూర్తి చేసి ఇజ్రాయెల్ సాంకేతికతో ప్రతి మూడు ఎకరాలకు సాగునీరు అందిస్తాం. బాజిరెడ్డి ప్రజా నాయకుడు భారీ మెజారిటీతో గెలిపించాలి.రూరల్ నియోజకవర్గ సమస్యలు అన్ని పరిష్కరిస్తాం’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.