CM KCR: నన్ను చూసి రెండు జాతీయ పార్టీలు భయపడుతున్నాయి
ABN , First Publish Date - 2023-11-18T19:46:28+05:30 IST
బీఆర్ఎఎస్ పార్టీ ( BRS party ) ని ముంచడానికి చేయని కుట్రలు లేవని సీఎం కేసీఆర్ ( cm kcr ) అన్నారు. శనివారం నాడు జనగామ నియోజకవర్గం చేర్యాలలో సీఎం కేసీఅర్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు.
సిద్దిపేట: బీఆర్ఎఎస్ పార్టీ ( BRS party ) ని ముంచడానికి చేయని కుట్రలు లేవని సీఎం కేసీఆర్ ( cm kcr ) అన్నారు. శనివారం నాడు జనగామ నియోజకవర్గం చేర్యాలలో సీఎం కేసీఅర్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభలో జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్సీ బొడకుంట వెంకటేశ్వర్లు, బీర్ఎస్ నేతలు, కార్యకర్తలు. సభకు పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..‘‘75 ఏళ్ల ప్రజస్వామిక భారతంలో తగినంత పరిణతి, పరివర్తన రాలేదు. ఎన్నికలు వచ్చాయంటే అబద్ధాలు, అబాండాలు, కత్తులతో పొడుసుడు జరుగుతున్నాయి. ఎన్నిక వస్తే అభ్యర్థి గుణగణాలు చూడాలి.. దానికంటే ఎక్కువ ఆ వ్యక్తి వెనుక ఉన్న పార్టి చరిత్ర చూడాలి. పార్టీల నిజానిజాలు ప్రజలకు తెలిసేలా చర్చ జరగాలి. ఓటు సొంత విచక్షణతో వేయాలి. బీఆర్ఎస్ పార్టీ చరిత్ర మీ కళ్ల ముందు ఉన్నది.. కాంగ్రెస్ చరిత్ర కూడా మీ ముందు ఉన్నది. 50 ఏళ్లలో వారు చేసిందేమీ, మేము చేసిందేమీ ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణను ముంచి 58 ఏళ్లు ఉసురు పోసుకున్నారు. 2004లో మన పొత్తుతో ఇక్కడా, ఢిల్లీలో అధికారంలోకి వచ్చారు. తెలంగాణను గోడ గోడ ఏడిపిచ్చారు. పదేళ్ల తెలంగాణలో అన్ని సమకురిస్తే, నేడు వచ్చి మభ్యపెడతున్నారు. రోడ్డు మీద పోతుంటే అనేక కుక్కలు మోరుగుతాయి పట్టించుకోవద్దు. కేసీఆర్‌కు పిండం పెడతామన్నారు. ఎవరికి పిండం పెట్టాలో మీరే నిర్ణయించాలి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను సర్వ నాశనం చేసింది. సంక్షేమ పథకాల అమలులో మనకు ఒక్క పద్ధతి ఉన్నది.కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలో అయినా 2 వేల పెన్షన్ ఉన్నదా ? పేదలకు సంక్షేమం ముందు చేసుకున్నాం. తర్వాత రైతుల కోసం ఆలోచించాం.. నీటి తీరువా ఎత్తివేసినం.. 24 గంటల కరెంట్ ఇచ్చినం.. రైతు బంధు ఇచ్చుకుంటున్నం.. రైతు బీమా ఇస్తున్నాం.. పంటను 7,500 కొనుగొలు కేంద్రాలు పెట్టి కొంటున్నాం’’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ వెనక పడింది
‘‘50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ వెనక పడింది.. కరువు ప్రాంతంగా మారింది. ఈ రోజు పంజాబ్‌ను వెనక్కి నెట్టి 3 కోట్ల టన్నుల వడ్లు పండిస్తున్నాం. రైతు బంధు వేస్ట్ అని పీసీసీ మాజీ అధ్యక్షుడు అంటున్నాడు. 24 గంటల కరెంట్ వేస్ట్ అని అంటున్నాడు రేవంత్‌రెడ్డి అంటున్నారు. కర్ణాటక రాష్ట్రంలో 20 గంటలు కరెంట్ ఇస్తున్నారనిని ఇక్కడ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి తెలంగాణకు వచ్చి 5 గంటలు ఇస్తున్నామన్నారు.. 24 గంటలు ఇస్తున్న మాకు సుద్దులు చెబుతున్నారు.ధరణిని కాంగ్రెస్ నేతలు బంగాళాఖాతంలో వేస్తామంటున్నారు. రైతుబంధు డబ్బులు, వడ్లు అమ్మిన డబ్బులు బ్యాంకులో వేస్తున్నాం.. ధరణిని తీసేస్తే ఈ డబ్బులు ఎట్లా వస్తాయి. మళ్లీ దళారుల రాజ్యం తెస్తారట. ధరణిలో ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకుందాం. కాంగ్రెస్ నేతలు 3 గంటల కరెంటు ఇస్తారట.. 10 హెచ్‌పీ మోటార్లు పెట్టుకోవాలని అంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంట్ రావడం లేదు.మోటార్లకు మీటర్లు పెట్టలేదని 25 వేల కోట్లు ఇయ్యకుండామోదీ ఆపిండు. ఒకడు మూడు గంటలోడు.. మరొకడు మోటార్లకు మీటర్లు పెట్టేటోడు.. ఎవరు కావాలో తేల్చుకోవాలి. పాడి బర్రెను అమ్ముకుని ఎవడన్న దున్నపోతును తెచ్చుకుంటారా ? రెండు జాతీయ పార్టీలకు కేసీఆర్‌ను చూస్తే భయపడుతున్నారు. మహారాష్ట్ర లో నన్ను చూసి కాంగ్రెస్, బీజేపీలు జడుసుకుంటున్నాయి. మహారాష్ట్రలో 150 గ్రామాల వాళ్లు తమను తెలంగాణలో కలపాలని తీర్మానాలు చేశారు. నేను మహారాష్ట్రలో సభ పెడితే జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలిచాక నెల రోజుల్లో చేర్యాల డివిజన్ ఏర్పాటు చేస్తా’’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.