CM Revanth Reddy: తెలంగాణ ప్రజలకు మేం పాలకులం కాదు.. సేవకులం
ABN , First Publish Date - 2023-12-07T15:32:22+05:30 IST
తెలంగాణ ప్రజలకు మేం పాలకులం కాదు సేవకులమని సీఎం రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) వ్యాఖ్యానించారు. గురువారం నాడు ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ‘‘సోనియా గాంధీ ఉక్కు సంకల్పంతో తెలంగాణ ఇచ్చింది. ప్రజాస్వామ్యం హత్యకి గురైంది. ప్రజల సమస్యలు చెప్పుకుందాం అంటే వినే ప్రభుత్వమే లేకుండే. తెలంగాణ రైతాంగానికి, విద్యార్థులకు, నిరుద్యోగులకు భరోసాగా ఉంటాం’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు మేం పాలకులం కాదు సేవకులమని సీఎం రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) వ్యాఖ్యానించారు. గురువారం నాడు ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ‘‘సోనియా గాంధీ ఉక్కు సంకల్పంతో తెలంగాణ ఇచ్చింది. ప్రజాస్వామ్యం హత్యకి గురైంది. ప్రజల సమస్యలు చెప్పుకుందాం అంటే వినే ప్రభుత్వమే లేకుండే. తెలంగాణ రైతాంగానికి, విద్యార్థులకు, నిరుద్యోగులకు భరోసాగా ఉంటాం. ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేస్తాం. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. ప్రజా ప్రభుత్వంలో సామాజిక న్యాయం జరుగుతుంది. ప్రగతి భవన్ గడి చుట్టూ ఉన్న ఇనుప కంచే బద్దలు కొట్టాం. ప్రభుత్వానికి ఏం చెప్పడానికైనా ఎవరైనా ప్రగతి భవన్ రావచ్చు అని ప్రజలకు మాట ఇస్తున్నాను. రేపు (శుక్రవారం) ఉదయం రేపు పది గంటలకు ప్రజాదర్బార్ నిర్వహిస్తాం. ప్రగతి భవన్ ఇకపై జ్యోతి రావు ఫూలే ప్రజా భవన్‌గా ఉంటుంది. నిస్సహాయులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది. మీ సోదరుడిగా అందరికీ నేను అండగా ఉంటానని మాట ఇస్తున్నాను.మాకు ఇచ్చిన అవకాశాన్ని బాధ్యతగా తీసుకుంటున్నాం. కష్టపడ్డ ప్రతి ఒక్కరినీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా’’ అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.