Etala Rajender ఆ విషయంలో కేసీఆర్ మైండ్ బ్లాక్ అయింది
ABN , First Publish Date - 2023-11-22T23:06:34+05:30 IST
దుబ్బాకలో బీజేపీ పార్టీకి డిపాజిట్ రాదని ఉపఎన్నికల్లో ప్రచారం చేశారు కానీ.. ఫలితం వచ్చిన తర్వాత కేసీఆర్ మైండ్ బ్లాక్ అయిందని గజ్వేల్ బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీమంత్రి ఈటల రాజేందర్ ( Etala Rajender ) అన్నారు.
సిద్దిపేట : దుబ్బాకలో బీజేపీ పార్టీకి డిపాజిట్ రాదని ఉపఎన్నికల్లో ప్రచారం చేశారు కానీ.. ఫలితం వచ్చిన తర్వాత కేసీఆర్ మైండ్ బ్లాక్ అయిందని గజ్వేల్ బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీమంత్రి ఈటల రాజేందర్ ( Etala Rajender ) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘‘మీరు నినాదాలు చేస్తున్నారు.. సీఎం అని నేనే సీఎం కావాలంటే మీ రగన్న ఇక్కడ గెలువాలి. 20 ఏళ్లు కేసీఆర్ అడుగులో అడుగు వేసి నడిసిన ఎప్పుడు పార్టీకి మచ్చ తేలేదు..నన్ను పార్టీ నుంచి పంపించారు. నీకు దమ్మటే రాజీనామా చేయమన్నాడు.. నాది రోషం పుట్టుక.. రాజీనామా చేసి మొఖనికి కొట్టా.. ప్రజలను నమ్ముకొని, న్యాయం, ధర్మం నమ్ముకొన్నాను. హుజురాబాద్ ప్రజలు కేసీఆర్‌కి కర్రు కాల్చి వాత పెట్టారు. హుజురాబాద్‌లో నన్ను ఓడించడానికి ఎన్ని ఓట్లు ఉన్నాయో అన్ని కండువాలను మంత్రి హరీశ్‌రావు కప్పారు. అయినా పని కాలేదు.. రేపు దుబ్బాక, గజ్వేల్ లో కూడా కాదు.. ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన నాయకులు రాయపోల్‌లో దళిత బంధు ఎందుకు ఇవ్వలేదు’’ అని ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోదీ మాట ఇస్తే.. తప్పడు
‘‘ఎక్కడికి వెళ్లిన కేసీఆర్ మీద దుమ్ము ఎత్తి పోస్తున్నారు.. గజ్వేల్‌లో కేసీఆర్ ఓటు వేసిన పాపానికి పేదల భూములు లాక్కొని కోట్ల రూపాయలకు భూములు అమ్ముకున్నారు.గజ్వేల్‌లో 352 ఎకరాల దళితుల నుంచి భూములు లాక్కుని వేల కోట్లకు అమ్ముకొని డబ్బులు దండుకున్నారు. గజ్వేల్‌లో నాతో పాటు 30 వేల మంది కేసీఆర్ బాధిత కుంటుంబాలున్నాయి. హుజురాబాద్ ఎన్నికల్లో 6 నెలల పాటు మీసం కట్టిన పిల్లలకు తాగుడు అలవాటు చేసిండు.. గజ్వేల్‌లో అదే పని చేస్తుండు.. తాగుడు అలవాటు మనిపించడానికి రెండేళ్లు సమయం పట్టింది. దుబ్బాక, గజ్వేల్ గడ్డ మీద బీజేపీ పార్టీని గెలిపించండి. కరోనాలో ఆరోగ్య మంత్రిగా ఉండి... అందరిలో ధైర్యాన్ని నూరు పోసిన వ్యక్తిని నేను. మోదీ మాట ఇస్తే.. తప్పడు. మోదీ తెలంగాణ రైతులును మద్దతు ధర పెంచుతానని మాట ఇచ్చిండు.. అధికారంలోకి వస్తే పక్క చేస్తాడు’’ అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.