Share News

Telangana Elections: తెలంగాణలో అధికారంలోకి రాబోయేది ఏ పార్టీనో చెప్పిన చింతామోహన్

ABN , First Publish Date - 2023-11-14T13:34:35+05:30 IST

Telangana Elections: తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 30న ఎన్నికలు జరుగునున్నాయి. ఈసారి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అధికార బీఆర్‌ఎస్ పార్టీ చెబుతుండగా.. ఈ ఎన్నికల్లో గెలిచేది తమ పార్టీనే అని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Telangana Elections: తెలంగాణలో అధికారంలోకి రాబోయేది ఏ పార్టీనో చెప్పిన చింతామోహన్

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 30న ఎన్నికలు (Telangana Elections) జరుగునున్నాయి. ఈసారి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అధికార బీఆర్‌ఎస్ పార్టీ (BRS) చెబుతుండగా.. ఈ ఎన్నికల్లో గెలిచేది తమ పార్టీనే అని కాంగ్రెస్ (Congress) ధీమా వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉండలా తెలంగాణలో ఎన్నికలపై మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ (Former Union Minister Chinta Mohan) స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నారన్నారు. తెలంగాణలో బీజేపీతో (BJP) కలిసి పోటీ చేస్తూ పవన్ కళ్యాణ్(Janasena Chief Pawan Kalyan) తప్పు చేశారన్నారు. తెలంగాణలో బీజేపీ, పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేసినా ఇద్దరికి వచ్చేది 5 సీట్లే అని అన్నారు. తెలంగాణలో ఎన్టీఆర్ పోటీ చేసినా గెలవరన్నారు. ఏపీలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అనుకుంటున్నారని.. కానీ తమ పార్టీ నేతలే ప్రజలను ఓట్లు అడగడం లేదని మాజీ కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు.


చింతామోహన్ ఇంకా మాట్లాడుతూ.. బీజేపీ అధికారం కోసం ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్లు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ అంశం కోర్టు పరిధిలో ఉందని.. కోర్టు నిర్ణయిస్తుందని తెలిపారు. హైదరాబాద్‌లో మోడీ (PM Modi) చేసిన ప్రసంగం తనకు నచ్చలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీలకు ఏమీ చేయలేదన్న మోడీ మాటలు బాధించాయన్నారు. కృష్ణా జిల్లా ఎస్సీల వల్ల గాంధీకి సౌత్ ఆఫ్రికాలో గుర్తింపు వచ్చిందని తెలిపారు. భారత్‌లో అంటరానితనం ఉందని గాంధీకి తెలిపింది ఎస్సీలు అని.. దేశ స్వతంత్రం, అంటరానితనం గురించి గాంధీ పోరాడారని చెప్పుకొచ్చారు. ఒకప్పటి ఎస్సీలు కాంగ్రెస్ పార్టీ వల్ల ఇప్పుడు దళితులు అయ్యారన్నారు. నెహ్రూ, అంబేడ్కర్‌కు మంచి సంబంధాలు ఉండేవని.. అంబేడ్కర్‌ రాజ్యాంగ రూపక్త కావడానికి కాంగ్రెస్ పార్టీ కారణమన్నారు. రాజ్యాంగ రూపకర్తగా రెండు సార్లు అంబేడ్కర్ రాజీనామా చేస్తే దాన్ని నెహ్రూ తిరస్కరించారని గుర్తుచేశారు. ఎస్సీలకు 12 శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందన్నారు. దేశానికి మొదటి రాష్ట్రపతి విజయవాడకి చెందిన దళితుడు చక్రయ్యను చేయాలని గాంధీ భావించారని.. కానీ ఆయన చనిపోవడంతో అది జరగలేదన్నారు. బీజేపీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు ఏమైనా చేశారా అని ప్రశ్నించారు. మోడీ అదానీ, అంబానీలకే అన్ని చేస్తున్నారని మండిపడ్డారు. యూపీలో దళితుల్లో అనేక వర్గాలు ఉన్నాయని.. ఎవరికి ఎంత శాతం రిజర్వేషన్లు కల్పిస్తారని అడిగారు. ఓట్ల కోసం మోడీ చేస్తున్న ప్రసంగాలను ఖండిస్తున్నానన్నారు. 75 ఏళ్లలో రాజకీయాల్లో బతికి ఉన్నది ఇందిరాగాంధీ మాత్రమే అని అన్నారు. ‘‘జగన్ (AP CM Jagan) పాలన బాగుంటుంది అనుకున్నాను.. కానీ ఆయన డీలా పడ్డారు. నా మిత్రుడు కుమారుడు బాగా చేస్తాడు అనుకున్నా’’ అని చింతామోహన్ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-11-14T13:34:36+05:30 IST