Share News

Karnataka Minister: తెలంగాణలో ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతాం

ABN , First Publish Date - 2023-11-14T15:56:58+05:30 IST

ఐదు రాష్ట్రల్లో ఎన్నికలు జరుగుతున్నాయని.. వివిధ పార్టీలను ఈ ఎన్నికల్లో ఎదుర్కొంటున్నామని కర్ణాటక మంత్రి దినేష్ గుండురావు అన్నారు.

Karnataka Minister: తెలంగాణలో ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతాం

హైదరాబాద్: ఐదు రాష్ట్రల్లో ఎన్నికలు జరుగుతున్నాయని.. వివిధ పార్టీలను ఈ ఎన్నికల్లో ఎదుర్కొంటున్నామని కర్ణాటక మంత్రి దినేష్ గుండురావు (Karnataka Minister Dinesh Gundurao ) అన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ముక్త భారత్‌ను కోరుకుందని.. కానీ కాంగ్రెస్ ఏంటో వివిధ రాష్ట్రాలలో గెలిచి చూపించామన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్‌ను (BRS) కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఎదుర్కుంటోందన్నారు. కర్ణాటక ఎన్నికల (Karnataka Elections) తర్వాత కాంగ్రెస్ వేగంగా పుంజుకుందని తెలిపారు. అభివృద్ధి నినాదం మీద ఏర్పడ్డ తెలంగాణ కేసీఆర్ (CM KCR) కుటుంబం చేతిలో ఉందని విమర్శించారు. తెలంగాణ మిగులు నిధులతో ఆర్థికంగా బలమైన రాష్ట్రమని.. కానీ అభివృద్ధి శూన్యమన్నారు. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలను మూడు నెలల్లోనే అమలు చేశామని చెప్పుకొచ్చారు. కేంద్రం సపోర్ట్ చేయకపోయినా బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. మన దేశంలో లక్షలకోట్ల రూపాయలు ధనికులు, వ్యాపారులు కొల్లాగొట్టారన్నారు. తెలంగాణలో ఆరు గ్యారెంటీలను అమలుచేసి తీరుతామని స్పష్టం చేశారు. విద్యుత్ విషయంలో తెలంగాణ పరిస్థితులకు, కర్ణాటక పరిస్థితులకు చాలా తేడా ఉందని.. అయినా కర్ణాటక లో ఎలాంటి సమస్య లేదని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు ఏమైనా డౌట్ ఉంటే కర్ణాటక విజిట్ చేయడానికి స్వాగత్తిస్తామన్నారు. సాధారణ పౌరులకు ఎలాంటి సమస్య లేకుండా కరెంట్ చార్జీలు అమలుచేస్తున్నామని చెప్పారు. కర్ణాటక రైతుల ధర్నా కావాలని ఆడిస్తున్న డ్రామా అంటూ దినేష్ గుండురావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-11-14T15:56:59+05:30 IST