TS Election: ‘ప్లీజ్ మాడాడిని గెలిపించండి’ అంటూ కేసీఆర్ సభలో కౌశిక్‌రెడ్డి కూతురు భావోద్వేగం
ABN , First Publish Date - 2023-11-18T18:31:46+05:30 IST
హుజరాబాద్ ఎన్నికల ప్రచారం ( Huzarabad Election Campaign ) రసవత్తరంగా కొనసాగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ( BRS Party ) నుంచి పాడి కౌశిక్‌రెడ్డి ( Padi Kaushik Reddy ) , బీజేపీ పార్టీ ( BJP Party ) నుంచి బీజేపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి ఈటల రాజేందర్ ( Etala Rajender ) బరిలోకి దిగారు. ప్రత్యర్థులు పాడి కౌశిక్‌రెడ్డి, ఈటల రాజేందర్ ఒకరిపై ఒకరు పై చేయిగా ప్రచారం చేస్తున్నారు.
హుజరాబాద్ : హుజరాబాద్ ఎన్నికల ప్రచారం ( Huzarabad Election Campaign ) రసవత్తరంగా కొనసాగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ( BRS Party ) నుంచి పాడి కౌశిక్‌రెడ్డి ( Padi Kaushik Reddy ) , బీజేపీ పార్టీ ( BJP Party ) నుంచి బీజేపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి ఈటల రాజేందర్ ( Etala Rajender ) బరిలోకి దిగారు. ప్రత్యర్థులు పాడి కౌశిక్‌రెడ్డి, ఈటల రాజేందర్ ఒకరిపై ఒకరు పై చేయిగా ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఇద్దరు నేతలు వ్యూహలు రచిస్తున్నారు. ఇద్దరు కూడా తమదైన శైలిలో ప్రజలను ఆకట్టుకోడానికి పలు ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రత్యర్థి ఈటల రాజేందర్‌ని ఓడించడమే లక్ష్యంగా ఎన్నికల రణరంగంలో కౌశిక్‌రెడ్డి కుటుంబం జోరుగా ప్రచారం చేస్తోంది. కౌశిక్‌రెడ్డి కూతురు కొన్నిరోజులుగా తన నాన్న గెలుపు కోసం ఆహర్నిశలు శ్రమిస్తోంది. దీనికితోడు శుక్రవారం నాడు సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో కౌశిక్‌రెడ్డి కూతురు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆమె ప్రసంగం ఆద్యంతం ఆసక్తిగా సాగింది.
ఈ ప్రసంగంలో..‘‘మా నాన్న హుజరాబాద్ నియోజకవర్గానికి ఎంతగానో సేవ చేస్తున్నారు. పేద ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈసారి ఎన్నికల్లో నా తండ్రిని ఎమ్మెల్యేగా గెలిపించాలి. ప్లీజ్ మా డాడీని గెలిపించండి.. 1000 కోట్లు తీసుకొచ్చే బాధ్యత నాది అంటూ ఓటర్లకు ప్రామిస్ చేసింది. అంతేకాదు నా తండ్రికి రాజకీయాలు అంటే చాలా ఇష్టం అని, ఇప్పటికే మీరు నా తండ్రిని పలుమార్లు ఎన్నికల్లో ఓడించి ఇబ్బందికి గురి చేశారు. మా నాన్న అంటే నాకు ప్రాణం, ఆయన బాధపడితే చూడలేను’’ అని కౌశిక్‌రెడ్డి కూతురు కన్నీరు పెట్టుకుంది. కాగా కౌశిక్‌రెడ్డి కూతురు మాట్లాడుతున్నంత సేపు ఓటర్ల నుంచి అపూర్వ స్పందన లభించింది. కౌశిక్‌రెడ్డి కూతురిని సీఎం కేసీఆర్ కూడా అభినందిచినట్లు తెలుస్తుంది. కౌశిక్‌రెడ్డి కూతురు మాట్లాడిన అనంతరం ఆయన భార్య కూడా ప్రసగించారు. ‘‘నా కొంగు చాపి మిమ్మల్ని అడుగుతున్నా.. ఓట్లు వేసి మా ఆయనను గెలిపించండి’’ అంటూ ప్రాధేయపడింది.. కాగా, కౌశిక్‌రెడ్డి కూతురు, భార్య మాట్లాడిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలల్లో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి