CM KCR : కాంగ్రెస్ ఆ విషయంలో నన్ను మోసం చేసింది
ABN , First Publish Date - 2023-11-15T18:56:44+05:30 IST
ఇండియాలో తెలంగాణ నెం 1గా ఉందని సీఎం కేసీఆర్ ( CM KCR ) అన్నారు. బుధవారం నాడు ఎల్లారెడ్డిలో ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని మాట్లాడుతూ...‘‘ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నర లోపే 24 గంటల విద్యుత్ ఇచ్చాం.కామారెడ్డి ఎల్లారెడ్డి సాగునీటిలో వెనకబడింది. నేనే ఎమ్మెల్యే గా ఉండి పనిచేస్తానని కేసీఆర్ తెలిపారు.
కామారెడ్డి జిల్లా: ఇండియాలో తెలంగాణ నెం 1గా ఉందని సీఎం కేసీఆర్ ( CM KCR ) అన్నారు. బుధవారం నాడు ఎల్లారెడ్డిలో ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని మాట్లాడుతూ...‘‘ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నర లోపే 24 గంటల విద్యుత్ ఇచ్చాం.కామారెడ్డి ఎల్లారెడ్డి సాగునీటిలో వెనకబడింది. నేనే ఎమ్మెల్యే గా ఉండి పనిచేస్తా. ఇప్పుడు ఉన్న తెలంగాణను కాంగ్రెస్ పార్టీని మళ్లీ ఉడగొట్టేది. 33 మెడికల్ కాలేజ్‌లు స్థాపించుకున్నాం.1969లో తెలంగాణ ఉద్యమం వచ్చింది. 2004లో తెలంగాణ ఇస్తాం అంటే కాంగ్రెస్ పార్టీతో కలిసిన మళ్లీ కాంగ్రెస్ మోసం చేసింది.తెలంగాణ వచ్చడో కేసీఆర్ సచ్చుడో అంటే అప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. రైతు బంధు దుబారా అని రాహుల్ గాంధీ చెబుతున్నాడు. నీటి పన్ను రద్దు చేశాం. రైతు బంధు పుట్టిందే టీఆర్ఎస్ పార్టీ నుంచి. రైతు భీమా పెట్టినం. 5 ఎకరాలు ఉన్న కోటీశ్వరుడు అవుతున్నాడు. 3గంటల కరెంటు చాలని రేవంత్‌రెడ్డి అంటున్నారు. రాష్ట్రంలో 30 లక్షల మోటార్లు ఉన్నాయి. కాంగ్రెస్ వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తానని రేవంత్‌రెడ్డి అంటున్నాడు. రైతుల ఖాతాలో నేరుగా రైతు బంధు, బీమా, వడ్ల డబ్బులు నేరుగా ఖాతాలో పడుతున్నాయి. రాష్ట్రంలో 103 డయాలసిస్ కేంద్రాలు పెట్టుకున్నాం. గర్బధారణ సమయంలో అమ్మాయి పుడితే 13 వేలు.. అబ్బాయి పుడితే 12 వేలు పెట్టుకున్నాం.కాయితి లంబాడీలకు, బీసీల కోసం కొట్లాడతా’’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.