Share News

Mallu Ravi : కేసీఆర్ పదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి ఎవరిని కలవలేదు

ABN , First Publish Date - 2023-11-04T22:08:28+05:30 IST

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళారీ ప్రభుత్వం వస్తుందని కేసీఆర్ చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి ( Mallu Ravi ) అన్నారు.

Mallu Ravi : కేసీఆర్ పదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి ఎవరిని కలవలేదు

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళారీ ప్రభుత్వం వస్తుందని కేసీఆర్ చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి ( Mallu Ravi ) అన్నారు. శనివారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజా ప్రభుత్వం వస్తుంది. గ్రామ వార్డ్ మెంబర్ నుంచి ప్రజా ప్రతినిదుల పరిపాలన పునరుద్ధరణ వస్తుంది. పదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నా కేసీఆర్ ఎవరికి అందుబాటులో లేరు.కాంగ్రెస్ ,టీడీపీ ముఖ్యమంత్రులు ఉదయమే ప్రజలకు అందుబాటులో ఉండేవారు. సామాన్య ప్రజలకే కాదు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా సీఎంని కలిసే అవకాశం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతుల సమస్యలు వ్యవసాయ, లా అండ్ ఆర్డర్, పోలీస్ వ్యవస్థ క్యాబినెట్ మినిస్టర్ ద్వారానే పనులు జరుగుతాయి. ఎమ్మెల్యేలను, మంత్రులను దిష్టిబొమ్మాలుగా నడుపుతున్నారు. ప్రజలు ప్రజాస్వామ్య ప్రభుత్వం లేక స్వేచ్ఛగా మాట్లాడలేకపోతున్నారు.ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ పార్టీని 70 - 80 సీట్లతో గెలిపించాలని చూస్తున్నారు. కాంగ్రెస్‌లో చేరడానికి పెద్ద ఎత్తున వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సీట్లు ఇవ్వకున్నా కోదండరాం, షర్మిల మద్దతు తెలిపారు. లోక్‌సత్తా కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు టైంకి లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్‌లు చెప్పిన వినకుండా ముఖ్యమంత్రి చెప్పిన డిజైన్‌తో నిర్మించడంతో పిల్లర్లు కుంగిపోయాయి’’ అని మల్లు రవి తెలిపారు.

Updated Date - 2023-11-04T22:08:34+05:30 IST