Share News

Maram Jagadishwar : ఒకటో తేదీనే జీతాలు వేస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు

ABN , First Publish Date - 2023-12-08T22:17:45+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై మేనిఫెస్టో‌లో పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) అని తెలంగాణ ఎన్జీవోస్ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ ( Maram Jagadishwar ) అన్నారు.

Maram Jagadishwar : ఒకటో తేదీనే జీతాలు వేస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై మేనిఫెస్టో‌లో పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) అని తెలంగాణ ఎన్జీవోస్ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ ( Maram Jagadishwar ) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు , సీపీఎస్ రద్దు , పెండింగ్ ఏరియర్స్ చెల్లింపు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి అభినందనలు తెలిపినట్లు పేర్కొన్నారు. రెండు, మూడు రోజుల్లో తమతో సమావేశమై సమస్యలపై చర్చిస్తానని ముఖ్యమంత్రి హామీని ఇచ్చినట్లు వారు తెలిపారు.

ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినందుకే , బ్యాలెట్ ఓట్ల రూపకంగా కాంగ్రెస్ పార్టీకి ఉద్యోగులు మద్దతు తెలిపారని మారం జగదీశ్వర్ గుర్తు చేశారు. అనంతరం టీఎన్జీవోస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ ( Mujib ) మాట్లాడుతూ... గత ప్రభుత్వంలో అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని త్వరలో పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీని ఇచ్చినట్లు ముజీబ్ తెలిపారు. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా , నాంపల్లిలోని టీఎన్జీవోస్ హైదరాబాద్ జిల్లా కార్యాలయంలో ముజీబ్ ఆధ్వర్యంలో ఉద్యోగులు కేక్ కట్ చేసి బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు.

Updated Date - 2023-12-08T22:17:46+05:30 IST