Share News

Harish Rao: రైతు క్షేమం కోసమే కేసీఆర్ మీటర్లు పెట్టలేదు

ABN , First Publish Date - 2023-11-21T22:38:29+05:30 IST

కాంగ్రెస్ పార్టీ ( Congress party ) మేనిఫెస్టో కంటే బీఆర్ఎస్ పార్టీ ( BRS party ) మేనిఫెస్టో నూరు పాల్లు నయమని మంత్రి హరీశ్‌రావు (Minister Harish Rao ) తెలిపారు. మంగళవారం నాడు హుస్నాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం, రోడ్ షోలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు.

Harish Rao: రైతు క్షేమం కోసమే కేసీఆర్ మీటర్లు పెట్టలేదు

సిద్దిపేట జిల్లా: కాంగ్రెస్ పార్టీ ( Congress party ) మేనిఫెస్టో కంటే బీఆర్ఎస్ పార్టీ ( BRS party ) మేనిఫెస్టో నూరు పాల్లు నయమని మంత్రి హరీశ్‌రావు (Minister Harish Rao ) తెలిపారు. మంగళవారం నాడు హుస్నాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం, రోడ్ షోలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ...‘‘తెలంగాణాలో సీఎం కేసీఆర్ మీటర్లు పెట్టలేదని అందుకే 35,000 కోట్లు ఆపమని నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు.. 35 వేల కోట్లు ముఖ్యం కాదని రైతులే ముఖ్యమని కేసీఆర్ మీటర్లు పెట్టలేదు. కరెంట్ కావలో.. కాంగ్రెస్ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలి. కోతల రాయుుడు వచ్చాడు ఒకాయన మాటలు ఎక్కువ పని తక్కువ కరీంనగర్‌లో ఓడిపోయి ఇక్కడకు వచ్చాడు’’ అని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవ చేశారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కోతలే ఉంటాయి

‘‘హుస్నాబాద్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేశాం. గతంలో హుస్నాబాద్‌లో కాంగ్రెస్, తెలుగుదేశం, ఎర్రజెండాల పాలనలో కనీసం బుక్కెడు తాగు నీళ్లకు హుస్నాబాద్ నోచుకోలేదు, నేడు బంగారంలా రెండు పంటలు ఇక్కడ పండుతున్నాయి. కర్ణాటకలో 5 గ్యారంటీలని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో 9 గంటల వచ్చే కరెంట్ ఇప్పుడు 3 గంటలు కూడా రావట్లేదని, అన్నిటిలో కోతలు విధిస్తున్నారని అక్కడి ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఎగపెట్టిన చరిత్ర కాంగ్రెస్‌ది.. అమలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. మూడు గంటల కరంటోడు కాంగ్రెస్ ఓ దిక్కు, మీటర్ల బీజెపొడు ఓ దిక్కు, 24 గంటల ఉచిత కరెంటు కేసీఆర్ ఓ దిక్కు, ఏ దిక్కు ఎటుండాలో ప్రజలు ఆలోచించుకోవాలి. హుస్నాబాద్ అభివృద్ధికి తాను బాధ్యత తీసుకుంటా, ప్రజలే హై కమాండ్‌గా పనిచేసే పార్టీ బీఆర్ఎస్’’ అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

Updated Date - 2023-11-21T22:38:37+05:30 IST