Harish Rao: అబద్ధాలు చెప్పే పార్టీలను ఓడించండి
ABN , First Publish Date - 2023-11-20T16:40:35+05:30 IST
ఈ సారి గులాబీ జెండా ఎగరగానే గ్యాస్ సిలిండర్ నాలుగు వందలకే ఇస్తాం
సిద్దిపేట: కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) వంద అబద్ధాలు ఆడి గెలవాలని చూస్తున్నారని మంత్రి హరీశ్‌రావు (Harish Rao) ధ్వజమెత్తారు. గజ్వేల్ పట్టణంలోని ఇంద్ర పార్క్ చౌరస్తా దగ్గర జరిగిన రోడ్డు షోలో హరీశ్‌రావు పాల్గొని జాతీయ పార్టీలపై మండిపడ్డారు. ‘‘రైతుకే రైతు బంధు ఇచ్చిన ఘనత కేసీఅర్‌దే (Cm kcr). మళ్లీ బీఆర్ఎస్ (BRS) గెలిచిన వెంటనే జనవరి నుంచి రేషన్ కార్డులు ఉన్న వారికి సన్న బియ్యం పంపిణీ చేస్తాం. గెలవని బీజేపీకి ఓటు వేస్తే ఏం లాభం?. పువ్వు గుర్తు వాళ్లు వస్తే చీపురుతో కొట్టండి. ఈటల రాజేందర్ ఎప్పుడైనా మంచి, చెడులకు గజ్వేల్‌కు వచ్చారా?, ఘోరంగా ఉన్న గజ్వేల్‌ను ఘనంగా మార్చిన ఘనత కేసీఅర్‌ది. గత ప్రభుత్వ పాలనలో దొంగ రాత్రి కరెంట్ కోసం బావి దగ్గర సంసారం చేయాల్సి వచ్చేది.’’ అని విమర్శించారు.
‘‘మన తల రాత మార్చేది ఓటు కావున సరైన విధంగా సద్వినియోగం చేసుకోవాలి. నెలకు 3 వేల రూపాయలు సౌభాగ్య లక్ష్మి కింద కేసీఅర్ ఇవ్వనున్నారు. ఈ సారి గులాబీ జెండా ఎగరగానే గ్యాస్ సిలిండర్ నాలుగు వందలకే ఇస్తాం.’’ అని మంత్రి చెప్పుకొచ్చారు. ఈ రోడ్ షోలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, FDC చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి