MLC Kavitha: సుదర్శన్‌రెడ్డి బోధన్ అభివృద్ధికి చేసింది ఏమీ లేదు
ABN , First Publish Date - 2023-11-15T15:29:15+05:30 IST
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి బోధన్ అభివృద్ధికి చేసింది ఏమీ లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kavitha ) అన్నారు.
నిజామాబాద్ జిల్లా: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి బోధన్ అభివృద్ధికి చేసింది ఏమీ లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kavitha ) అన్నారు. బుధవారం నాడు బోధన్‌లో ప్రజా ఆశీర్వాద నిర్వహించారు. ఈ సభలో కవిత పాల్గొని మాట్లాడుతూ..‘‘ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి షకీల్నీ అఖండ మెజార్టీతో ఈ ఎన్నికల్లో గెలిపించాలి. రాష్ట్రంలో పింక్ వేవ్ కనబడుతోంది. మూడో సారి సీఎం కేసీఆర్ కావడం ఖాయం. సౌత్ ఇండియాలో ఎవరికి రాని రికార్డు కేసీఆర్‌కి దక్కుతుంది. 75 ఏళ్ల స్వాతంత్ర్య దేశంలో కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు రైతులకు గుర్తించారా. ఆడపిల్లలకు అండగా కేసీఆర్ నిలిచారు. ఇంటింటికీ కళ్యాణ లక్ష్మి ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేశారని ప్రతిపక్షాలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. తెలంగాణకు చుక్క నీటిని కూడా ఇవ్వలేనీ వారు నేడు కేసీఆర్ ప్రభుత్వంపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. ఎమ్మెల్యే షకీల్ బోధన్ చివరి ఆయకట్టుకు నిరందించారు. అభివృద్ధి చేసే వారిని ఈ ఎన్నికల్లో ఆశీర్వదించాలి’’ అని కవిత తెలిపారు.