Narayana Swamy: కేసీఆర్ ఉద్యోగాలు భర్తీ చేస్తానని.. మాట తప్పాడు
ABN , First Publish Date - 2023-11-23T15:11:22+05:30 IST
సీఎం కేసీఆర్ ( CM KCR ) ఉద్యోగాలు భర్తీ చేస్తానని.. మాట తప్పాడని పాండిచ్చేరి మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి ( Narayana Swamy ) అన్నారు.
కామారెడ్డి జిల్లా: సీఎం కేసీఆర్ ( CM KCR ) ఉద్యోగాలు భర్తీ చేస్తానని.. మాట తప్పాడని పాండిచ్చేరి మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి ( Narayana Swamy ) అన్నారు. గురువారం నాడు ఆయన కామారెడ్డి జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘పదేళ్ల క్రితం సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని సీఎం కేసీఆర్ మాట తప్పడు. దేశంలోనే సచివాలయానికి పోకుండా ఇంటి నుంచి పని చేసే ఏకైక ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ మాత్రమే. ఉద్యోగాలు భర్తీ చేస్తా అని మాట తప్పి, నిరుద్యోగ భృతిని ప్రకటించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తాం’’ అని నారాయణస్వామి పేర్కొన్నారు.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి