Share News

TS Police Raids: రాజేంద్రనగర్‌లో లాడ్జీలపై పోలీసుల దాడులు

ABN , First Publish Date - 2023-11-05T07:36:53+05:30 IST

నగరంలోని రాజేంద్రనగర్‌ ( Rajendranagar ) లో లాడ్జీలపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు సోదాలు నిర్వహించారు.

TS Police Raids: రాజేంద్రనగర్‌లో లాడ్జీలపై పోలీసుల దాడులు

హైదరాబాద్‌: నగరంలోని రాజేంద్రనగర్‌ ( Rajendranagar ) లో లాడ్జీలపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు సోదాలు నిర్వహించారు. ఎన్నికల దృష్ట్యా తనిఖీలు చేపట్టినట్లు డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. లాడ్జీలలో బస చేసిన వారి వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు వస్తే సమాచారం ఇవ్వాలని డీసీపీ లాడ్జీ నిర్వాహకులకు ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ఉచిత సామాగ్రి, డబ్బును లాడ్జీలలో దాచిపెట్టి పంచ్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2023-11-05T07:36:55+05:30 IST