Raghunandan Rao: దుబ్బాక బంద్‌పై పోలీసులు ఏం చెబుతారు
ABN , First Publish Date - 2023-10-31T12:01:04+05:30 IST
పోలీసులు పూర్తి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్‌రావు ( Raghunandan Rao ) అన్నారు
సిద్దిపేట: పోలీసులు పూర్తి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్‌రావు ( Raghunandan Rao ) అన్నారు. మంగళవారం నాడు ABN తో రఘునందన్ మాట్లాడుతూ..‘‘దుబ్బాక ఎన్నికలు ఇంత సెన్సిటివ్‌గా మారడానికి అక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉండటమే కారణం. బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడికి పాల్పడిన వ్యక్తి బీజేపీ మద్దతుదారుడిగా మీడియాలో, నాతో చాట్ చేసినట్లు సోషల్ మీడియాలో అవుతున్న ప్రచారంపై పోలీసులు స్పందించాలి. బీజేపీ కార్యకర్తలు కనిపిస్తే కేసులు పెట్టే పోలీసులకు అధికార పార్టీ ఆగడాలు కనిపించడం లేదా ? బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు 4 + 4 సెక్యూరిటీ కల్పించాలని ఆదేశించిన అడిషనల్ డీజీపీ, ప్రతిపక్ష ఎమ్మెల్యే అభ్యర్థులకు సెక్యూరిటీని ఎందుకు కల్పించడం లేదు. ప్రతిపక్షాలపై దాడులు చేయాలని ఎదుటి వారికి చెబుతున్నారా ?మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, 30 పోలీస్ ఆక్ట్ అమల్లో ఉన్న సమయంలో దుబ్బాకలో బీఆర్ఎస్ కార్యకర్తలు గుంపులు గుంపులుగా తిరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు. దుబ్బాక బంద్‌పై పోలీసుల రియాక్షన్ కోసం సాయంత్రం వరకు ఎదురు చూస్తాం. పోలీసులు స్పందించకుంటే దుబ్బాక పరిణామాలపై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం. పోలీసులు పూర్తిగా ఏకపక్షంగా ప్రమోషన్ల కోసం, పైరవీల కోసం పాకులాడుతూ ప్రతిపక్ష ఎమ్మెల్యే అభ్యర్థులపై వివక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారు’’ అని రఘునందన్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.