CPI Raja: మోదీ అదానీ, అంబానీల కోసం పనిచేస్తున్నారు
ABN , First Publish Date - 2023-11-24T22:21:58+05:30 IST
మోదీ అదానీ అంబానీల కోసం పనిచేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా ( Raja ) పేర్కొన్నారు. శుక్రవారం నాడు కొత్తగూడెం...ప్రజా భేరి సభలో రాజా మాట్లాడుతూ... కాంగ్రెస్, కమ్యునిస్ట్ పొత్తు చారిత్రక అవసరం. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని రాజా అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం: మోదీ అదానీ అంబానీల కోసం పనిచేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా ( Raja ) పేర్కొన్నారు. శుక్రవారం నాడు కొత్తగూడెం...ప్రజా భేరి సభలో రాజా మాట్లాడుతూ...‘‘ కాంగ్రెస్, కమ్యునిస్ట్ పొత్తు చారిత్రక అవసరం. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ఫాసిస్ట్ బీజేపీ కోరల్లో నుంచి దేశాన్ని విముక్తి చేయాలని కాంగ్రెస్ కమ్యునిస్ట్ కలిసింది. మోదీ నిరంకుశ నియంత పాలనకు వ్యతిరేకంగా ఐదు రాష్ట్రాల్లో తీర్పు ఇవ్వాలి. సీఎం కేసీఆర్, ప్రధానమంత్రి నరేంద్రమోదీలకు పాలించే నైతిక హక్కు లేదు. బీఆర్ఎస్ను ఈ ఎన్నికల్లో ఓడించాలి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించే ఈ దెబ్బ వచ్చే లోకసభ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి తగలాలి. మోదీ పాలనలో నిరుద్యోగం పెరిగింది. సింగరేణి గనులను అదానీకి కట్టబెట్టారు. కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు గెలుపుతో కాంగ్రెస్ సీపీఐ కూటమి సత్తా చాటాలి. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు దేశ రాజకీయాల్లో మలుపు కావాలి’’ అని డి.రాజా తెలిపారు.