Share News

Revanth Reddy : దొరల రాజ్యాన్ని బొందపెట్టి ఇందిరమ్మ రాజ్యం తేవాలి

ABN , First Publish Date - 2023-11-20T17:28:24+05:30 IST

దొరల రాజ్యాన్ని బొందపెట్టి ఇందిరమ్మ రాజ్యం తేవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) అన్నారు. కొండా దంపతులు పరకాల నుంచి వెళ్లాక కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టారని రేవంత్‌రెడ్డి అన్నారు.

Revanth Reddy : దొరల రాజ్యాన్ని బొందపెట్టి ఇందిరమ్మ రాజ్యం తేవాలి

వరంగల్: దొరల రాజ్యాన్ని బొందపెట్టి ఇందిరమ్మ రాజ్యం తేవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) అన్నారు. సోమవారం నాడు పరకాల విజయభేరి సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..‘‘కొండా దంపతులు పరకాల నుంచి వెళ్లాక కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టారు. ఇన్నేళ్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అణచివేతను తట్టుకున్నారు. కడుపులో పెట్టుకొని కాపాడే రేవూరి మీకోసం వచ్చాడు. నిండు చెరువులా సభకు జనం కదిలివచ్చారు. సాయుధ రైతాంగ పోరాటానికి పరకాల ఫిరంగిలా మారింది. తెలంగాణ ఉద్యమాన్ని పరకాల ఉవ్వెత్తున ఎగిసేలా చేసింది. తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జన్మస్థలం కూడా పరకాలనే. ప్రత్యేక నిధులు ఇచ్చి పరకాలను అభివృద్ధి చేస్తాం. కేసీఆర్ మాటలు చూస్తే మందేసి, మతి తప్పి మాట్లాడినట్లు ఉంది.

ఇందిరమ్మ రాజ్యం అంటే బీఆర్ఎస్ నేతలు హేళన చేస్తున్నారు. దొరల రాజ్యం కావాలా, ఇందిరమ్మ రాజ్యం కావాలా తేల్చుకోండి. ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం, భూమిలేని పేదలకు భూపంపిణీ చేశాం. బడి, గుడి, నీళ్లు ఇచ్చింది ఇందిరమ్మ రాజ్యమే. 'దొర ఏందిరో' అని పిడికిలి ఎత్తింది ఇందిరమ్మ రాజ్యం. ఎస్సీ, ఎస్టీలు పదవులు అనుభవించేలా ఇందిరమ్మ రాజ్యం చేసింది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణను ఇందిరమ్మ రాజ్యం ఇచ్చింది’’ అని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2023-11-20T17:28:25+05:30 IST