Share News

Thummala: ఎవరో రాసి ఇచ్చిన స్రిప్ట్‌ను కేసీఆర్ చదివాడు

ABN , First Publish Date - 2023-11-15T17:02:59+05:30 IST

తనపై, పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఖమ్మం, అశ్వారావుపేట పర్యటనలల్లో సీఎం కేసీఆర్ మాట్లాడటం హేయమైన చర్య అని.. ఎవరో రాసి ఇచ్చిన స్రిప్ట్‌ను ఆయన చదివాడని ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి , మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) వ్యాఖ్యానించారు.

Thummala:  ఎవరో రాసి ఇచ్చిన స్రిప్ట్‌ను కేసీఆర్ చదివాడు

ఖమ్మం జిల్లా: తనపై, పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఖమ్మం, అశ్వారావుపేట పర్యటనలల్లో సీఎం కేసీఆర్ మాట్లాడటం హేయమైన చర్య అని.. ఎవరో రాసి ఇచ్చిన స్రిప్ట్‌ను ఆయన చదివాడని ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి , మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) వ్యాఖ్యానించారు. బుధవారం నాడు తుమ్మల పొంగులేటి క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తుమ్మల మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో జరిగే ఎన్నికలు భారతదేశ భవిష్యత్తు మార్చే ఎన్నికలు. తెలంగాణ అంతటా ఖమ్మం వైపు చూస్తుంది. నాల్గొ పిల్లర్ అయినా మీడియా కూడా న్యాయం ధర్మం పక్షాన నిలబడాల్సిన అవసరం ఉంది. మా ఇద్దరి చరిత్ర అంతా మీకు తెలుసు. నాకు కేసీఆర్ చిరకాల మిత్రుడు..పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి కొంతకాలం మిత్రుడు.మా పై ఖమ్మంలో విమర్శించారు.. అశ్వారావుపేటలో కూడా కేసీఆర్ మాట్లాడారు. ఆయన మా కంటే తెలివైన వాడు..సాహిత్యం తెలిసినవాడు ఇలా మాట్లాడడం అయన విజ్ఞతకే వదిలేస్తున్నాను. మేం కరకట ధమనులం అయితే మాకోసం మూడు నెలలు కేసీఆర్ ఎందుకు తిరిగారు’’ అని తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-11-15T17:03:00+05:30 IST