Share News

Thummala: జన శక్తి ముందు వందల కోట్లు లెక్క కాదు

ABN , First Publish Date - 2023-11-18T14:50:01+05:30 IST

జన శక్తి ముందు.. వందల కోట్లు లెక్క కాదని ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) అసెంబ్లీ అభ్యర్థి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) అన్నారు.

Thummala: జన శక్తి ముందు వందల కోట్లు లెక్క కాదు

ఖమ్మం జిల్లా: జన శక్తి ముందు.. వందల కోట్లు లెక్క కాదని ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) అసెంబ్లీ అభ్యర్థి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) అన్నారు.శనివారం నాడు పెనుబల్లి మండలం కుప్పెనకుంట్లలో కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనంలో తుమ్మల పాల్గొని మాట్లాడుతూ..‘‘చారిత్రక ఘట్టం సత్తుపల్లితో మొదలవుతుంది. సొంతంగా ఖర్చు పెట్టి అభ్యర్థులను గెలిపించే ఓటర్లు ఉన్న ఏకైక నియోజకవర్గం సత్తుపల్లి మాత్రమే. నేను, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వేర్వేరు కాదు ఒక్కటే. అహంకారంకు, ఆత్మభిమానానికి మధ్య ఇప్పుడు పోటీ జరుగుతుంది.


ప్రజల కోసం చిత్తశుద్ధితో యజ్ఞంలా రాజకీయం చేశా. సీతారామ ఇస్తానంటేనే బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేరాను. నా చిన్నప్పుడే దివంగత నేత నందమూరి తారక రామారావు నాకు మంత్రి పదవి ఇచ్చారు. నాకు మంత్రి పదవి అవసరం లేదు.. మంత్రి పదవి కోసం నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. ముఖ్య మంత్రులు ఉన్న నియోజకవర్గాలతో పోలిస్తే సత్తుపల్లి నెంబర్ వన్. 80, 90 ఏళ్లలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసేందుకు వస్తున్నారు.

సత్తుపల్లి అభ్యర్థి మట్టా రాగమయిని గెలిపిస్తే మేం గెలిచినంత సంతోష పడతాం. ప్రజల శక్తి ముందు వందల కోట్లు లెక్క కాదు. పది రోజులు మీరు కష్టపడాలి.. ఆ తర్వాత మేం కష్టపడతాం. ప్రజా అభిమానంతో 40 ఏళ్లుగా ప్రజల ముందు ఉంటున్నాను. డిసెంబర్ 9వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఏర్పడుతుంది. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తాం.ఈ ఎన్నికలు అహంకారానికి ఆత్మ గౌరవనాకి మధ్య పోరాటం. ఎన్టీఆర్ రాజకీయ జన్మ ఇస్తే సత్తుపల్లి ప్రజలు ఆశీర్వదించారు.జలగం వెంగళరావు నేను సత్తుపల్లి కీర్తి ప్రతిష్టలు పెరిగేలా రాజకీయం చేశాం. వెంసూరు లిఫ్ట్....బేతుపల్లి కాల్వ పూర్తి చేసి సాగు నీటి కష్టాలు దూరం చేశా.

గోదావరి జలాలతో సత్తుపల్లిని సస్య శ్యామలం చేయడం కోసమే బీఆర్ఎస్‌లో చేరా. అవినీతి అరాచక రాజకీయాలు తరమి కొట్టాలని కాంగ్రెస్ పార్టీలో చేరాం.నేను, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరం సత్తుపల్లి అభివృద్ధికి పాటు పడతాం. గోదావరి జలాలతో సత్తుపల్లినీ పచ్చగా మార్చడం కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరాను. వంద , రెండు వందల కోట్లు అధికార పార్టీ ఖర్చు పెట్టినా గెలుపు కాంగ్రెస్ పార్టీదే. సత్తుపల్లి కాంగ్రెస్ అభ్యర్థి రాగమయిని గెలిపించాలి’’అని తుమ్మల పిలుపునిచ్చారు’’ అని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2023-11-18T17:14:48+05:30 IST