Telangana Elections: ఈసీ ఆదేశాలతో బీఫామ్ రాని అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్
ABN , First Publish Date - 2023-11-09T13:18:00+05:30 IST
Telangana Elections: తెలంగాణలో రేపటి (శుక్రవారం)తో నామినేషన్ల పర్వం ముగియనుంది. ఇప్పటికే అభ్యర్థులు ఆయా సెగ్మెంట్లలో పార్టీ తరపున ఏ ఫామ్, బీ ఫామ్లు అందజేస్తున్నారు.
హైదరాబాద్: తెలంగాణలో (Telangana State) రేపటి (శుక్రవారం)తో నామినేషన్ల (Nominations) పర్వం ముగియనుంది. ఇప్పటికే అభ్యర్థులు ఆయా సెగ్మెంట్లలో పార్టీ తరపున ఏ ఫామ్, బీ ఫామ్లు అందజేస్తున్నారు. అయితే తాజాగా ఈసీ (Election Commission) ఆదేశాలతో బీఫామ్ రానీ అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. రేపటిలో(నవంబర్ 10)లోగా ఫామ్ - ఏ, ఫామ్ - బీ సమర్పించాలని ఈసీ ఆదేశించింది. లేదంటే స్వతంత్ర అభ్యర్థులుగా గుర్తిస్తామని ఈసీ స్పష్టం చేసింది. ఇప్పటికే ఈసీ ఆఫీస్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (CM KCR) తరపున పలువురు నాయకులు ఏ ఫామ్ సబ్మిట్ చేశారు. రేపు సాయంత్రం 3 గంటల వరకు ఫామ్ ఏ, బీలను అందజేయాలని ఇప్పటికే ఆర్వోలకు సీఈవో ఆఫీస్ (CEO Office) నుంచి ఆదేశాలు వెళ్లాయి. అయితే ఇప్పటికీ ఆయా పార్టీల్లో కొంతమంది అభ్యర్థులకు బీఫామ్స్ అందని పరిస్థితి. రేపటితో చివరి తేదీ కావడంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. రేపు మధ్యాహ్నం 3 గంటలలోపు ఆర్వోలకు ఫామ్ ఏ అండ్ బీ అందకపోతే వారిని ఈసీ స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించనుంది.