Amith Shah ABN MD Radhakrishna: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణని కలవనున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా..
ABN , First Publish Date - 2023-06-13T22:38:25+05:30 IST
తెలుగు జనాలకు నిర్భయంగా, నికార్సైన వార్తలను అందిస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల (ABN andhrajyothy) ఎండీ వేమూరి రాధాకృష్ణను కేంద్ర హోమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా కలవనున్నారు. గురువారం ఉదయం 11గంలకు వేమూరి రాధాకృష్ణతో ఆయన నివాసంలో భేటీకానున్నారు. 2 రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణ వస్తున్న కేంద్రమంత్రి పలువురు ప్రముఖులను కలవాలని నిర్ణయించుకున్నారు.
హైదరాబాద్: తెలుగు జనాలకు నిర్భయంగా, నికార్సైన వార్తలను అందిస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల (ABN andhrajyothy) ఎండీ వేమూరి రాధాకృష్ణను కేంద్ర హోమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా కలవనున్నారు. గురువారం ఉదయం 11గంలకు వేమూరి రాధాకృష్ణతో ఆయన నివాసంలో భేటీకానున్నారు. 2 రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణ వస్తున్న కేంద్రమంత్రి పలువురు ప్రముఖులను కలవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా వేమూరి రాధాకృష్ణతోపాటు సినీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళితో కూడా భేటీకానున్నారు. మణికొండలోని ఆయన నివాసానికి వెళ్లి అమిత్ షా మాట్లాడనున్నారు.
అమిత్ షా తెలంగాణ షెడ్యూల్ మినిట్ టు మినిట్..
బుధవారం రాత్రి 11.55 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు అమిత్ షా.
రాత్రికి నోవాటెల్ హోటల్లో బస.
గురువారం ఉదయం 7.30 గంటల నుంచి నోవాటెల్ హోటల్లో తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశం.
మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ, సినీ డైరెక్టర్ రాజమౌళిలతో భేటీ.
12.45గంలకు గంటల నుంచి మధ్యాహ్నం 2గంటలకు శంషాబాద్ జేడీ కన్వెన్షన్‌లో బీజేపీ కార్యకర్తలతో లంచ్ మీటింగ్.
మధ్యాహ్నం 2.25 గంటలకు శంషాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 3.50 గంటలకు భద్రాచలానికి అమిత్ షా.
సాయంత్రం 4 గంటల నుంచి 4.40 గంటల వరకు రాములోరి ఆలయంలో ప్రత్యేకపూజలు.
సాయంత్రం 5గంలకు భద్రాచలం నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి 5.35గంలకు ఖమ్మానికి అమిత్ షా.
సాయంత్రం 5.40 గంటల నుంచి 5.55 గంటల మధ్యలో ఖమ్మంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించనున్న షా.
సాయంత్రం 6 - 7 గంటల మధ్య ఆర్జీఎమ్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్‌లో పబ్లిక్ మీటింగ్‌కి హాజరు.
రాత్రి 7- 7.40 గంటల మధ్య ఖమ్మం గెస్ట్ హౌస్‌లో అమిత్ షా డిన్నర్.
అనంతరం రోడ్డు మార్గాన ఖమ్మంలో బయలుదేరి రాత్రి 10.10 గంటలకు విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టుకు.
రాత్రి 10.15 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి అర్ధరాత్రి 12.05 గంటలకు అహ్మదాబాద్ చేరిక.