Kokapet Lands : కోకాపేట్ కాదు ‘కోట్లపేట్’.. ఆల్‌టైమ్ రికార్డ్ ధరకు అమ్ముడుపోయిన భూములు..!
ABN , First Publish Date - 2023-08-03T22:39:38+05:30 IST
అవును.. కోకాపేట్ భూములు (Kokapeta Lands) ‘కేక’ పుట్టించాయి!. కో అంటే కోటి అని కాసుల వర్షం కురిపించాయి.! మధ్యాహ్నం వరకు తెలంగాణ, హైదరాబాద్‌లోని భూముల రేట్లను క్రాస్ చేసిన ఈ భూములు వేలం ముగిసేసరికి ఆల్ ఇండియా రికార్డ్ (All India Record) సృష్టించాయి.!..
అవును.. కోకాపేట్ భూములు (Kokapeta Lands) ‘కేక’ పుట్టించాయి!. కో అంటే కోటి అని కాసుల వర్షం కురిపించాయి.! మధ్యాహ్నం వరకు తెలంగాణ, హైదరాబాద్‌లోని భూముల రేట్లను క్రాస్ చేసిన ఈ భూములు వేలం ముగిసేసరికి ఆల్ ఇండియా రికార్డ్ (All India Record) సృష్టించాయి.! దేశంలోనే ఈ రేంజ్‌లో రేట్లు పలికిన భూములు కోకాపేట్‌వి కావడం విశేషమని చెప్పుకోవచ్చు. వేలంపాట ముగిసేసరికి ఎకరం ఎంత ధర పలికింది..? మొదటి విడత, రెండో విడతలో వేలం ద్వారా ప్రభుత్వానికి ఎం మేరకు ఆదాయం వచ్చింది..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..
కేకో కేక.. అ‘ధర’హో!
నిధుల సమీకరణలో భాగంగా గండిపేట మండలం కోకాపేట్‌లో హెచ్‌ఎండీఏ (HMDA) చేపట్టిన భూముల అమ్మకం పెను సంచలనాలకు దారితీసింది. భూములు అమ్ముడవుతాయా? లేదా అనే సందిగ్ధం నుంచి ఊహించని కలలో కూడా ఊహించనంత రేట్లకు అమ్ముడుపోయాయి. నియోపోలీస్ లే అవుట్ (Neopolis Lands) భూముల ధరలు అంచనాలకు మించిపోయాయి. మధ్యాహ్నానికి హైదరాబాద్ (Hyderabad) చరిత్రలోనే అత్యధిక రేటుకి భూమి అమ్ముడుపోయిన రికార్డు నెలకొంది. అయితే వేలం పాట ముగిసే సరికి ఆల్ టైం రికార్డ్ నెలకొల్పింది. సీన్ కట్ చేస్తే.. కోకాపేట్ భూములు ఆల్ ఇండియా రికార్డ్‌లు (All India Records) తిరగరాసింది. గురువారం నాడు.. నియోపోలీస్ లే-అవుట్‌లోని 45.33 ఎకరాల్లో ఉన్న 6,7,8,9, 10, 11, 12, 13, 14 ప్లాట్లకు హెచ్ఎండీఏ వేలం వేసింది. ఇవాళ ఉదయం.. 6, 7, 8, 9 ప్లాట్ల వేలం ద్వారా రూ.1,532.50 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. ఇక సాయంత్రం నుంచి 10, 11, 14 నెంబరు ప్లాట్లకు వేలం నిర్వహించారు. 10వ నెంబరు ప్లాట్ అత్యధికంగా రూ.100.75 కోట్ల ధర పలికింది. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ ఉన్న రికార్డులన్నీ బద్ధలయ్యాయి.!. అయితే.. ప్లాట్ నెంబర్ 10లో 3.60 ఎకరాలు ఉంది. ఈ ఒక్క ప్లాట్‌తోనే హెచ్ఎండీఏకు రూ.360 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే.. అత్యల్పంగా ఎకరానికి రూ.67.25 కోట్లు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. కోకాపేట్‌లో రెండో విడత లో భూముల ఈ- వేలం ద్వారా తెలంగాణ సర్కార్‌కు రూ. 33,19.60 కోట్లు ఆదాయం వచ్చింది. ప్లాటు కనీస విస్తీర్ణం 3.9 ఎకరాల నుంచి 9.1 ఎకరాలుగా ఉంది. ఈ వేలంను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టిసి నిర్వహించింది. ఒక ఎకరానికి యావరేజ్ ధర రూ. 35 కోట్లుగా అధికారులు నిర్ణయించారు. ఈ వేలంలో యావరేజ్ ఎకరం ధర రూ. 73.23 కోట్లు రూపాయలు పలకడంతో హెచ్ఎండీఏకు కాసుల పంట పండినట్లయ్యింది.
ఎవరికి దక్కింది..?
గతంలో కోకాపేట్‌లో 49 ఎకరాల విస్తీర్ణంలోని ప్లాట్లను విక్రయించడం ద్వారా రెండువేల కోట్ల ఆదాయం వచ్చిన విషయం తెలిసిందే. అయితే కనిష్టంగా ఎకరా 31 కోట్ల నుండి అత్యధికంగా 60 కోట్ల రూపాయలు ధర పలికింది. అత్యల్పంగా 67.25 కోట్లు ఎకరం ధర పలికింది. ప్లాట్ నెంబర్-10 లో ఉన్న 3.60 ఎకరాల భూమిని రూ. 362.70 కోట్లకు ప్రముఖ రియల్ ఎస్టేస్ సంస్థ రాజపుష్ప ప్రాపర్టీస్ దక్కించుకుంది. మొత్తంగా 45.33 ఎకరాల్లో ఉన్న ఏడు ప్లాట్‌లతో రూ.2,500 కోట్ల వరకు సమీకరించుకోవాలని హెచ్‌ఎండీఏ భావించింది కానీ.. సగటున 73.23 కోట్ల రూపాయిలో మొత్తంగా రూ.3,319 కోట్లు సమీకరించుకోగలిగింది. ఇది నిజంగా చాలా శుభపరిణామమని నిపుణులు చెబుతున్నారు.
కోకాపేట్‌లో ఆకాశహర్మ్యాలు!
దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బహుళ అంతస్తుల భవనాలు హైదరాబాద్‌లో నిర్మితమవుతున్నాయి. ఇప్పటివరకూ హైదరాబాద్‌లో అత్యంత ఎత్తయిన భవనంలో 49 అంతస్తులు ఉండగా.. బెంగళూరులో 50 అంతస్తుల భవనం ఉంది. వాటిని తలదన్నుతూ ఆకాశానికి నిచ్చెన వేసినట్లుగా.. కోకాపేట్‌లో 57 అంతస్తుల భవనానికి ఇప్పటికే హెచ్‌ఎండీఏ అనుమతులిచ్చింది. దాని పనులు కూడా ప్రారంభమయ్యాయి. అదే తరహాలో మరో సంస్థ కూడా 56అంతస్తులతో భవనాన్ని నిర్మించేందుకు ముందుకొచ్చింది. కోకాపేట్ ప్రాంతంలో భవనాల ఎత్తుపై ఎలాంటి ఆంక్షలూ లేకపోవడంతో హెచ్‌ఎండీఏ నుంచి అనుమతులు చకచకా వచ్చేశాయి. దాని పనులు కూడా ప్రారంభమయ్యాయి. అదే తరహాలో మరో సంస్థ కూడా 56అంతస్తులతో భవనాన్ని నిర్మించేందుకు ముందుకొచ్చింది. కోకాపేట్ ప్రాంతంలో భవనాల ఎత్తుపై ఎలాంటి ఆంక్షలూ లేకపోవడంతో హెచ్‌ఎండీఏ నుంచి అనుమతులు చకచకా వచ్చేశాయి. దాంతోపాటు నానక్‌రాంగూడ, పుప్పాలగూడ, ఖాజాగూడ, నార్సింగి, నల్లగండ్ల, కొల్లూరు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లలో బహుళ అంతస్తుల భవనాలు వస్తున్నాయి. కాగా.. ఇక్కడ ఐటీ కంపెనీల కోసం బహుళ అంతస్తుల భవనాలు నిర్మించడానికి అనుగుణంగా హెచ్‌ఎండీఏ ఈ స్థలాన్ని అభివృద్ధి చేస్తోంది. అందులో ఒకేచోట ఉన్న సుమారు 50 ఎకరాలను వేలానికి పెట్టారు. హెచ్‌ఎండీఏ దీన్నే ’నియోపోలిస్’గా పరిగణిస్తోంది.