Corona Virus: తెలంగాణలో కొత్తగా 10 కరోనా కేసులు నమోదు
ABN , Publish Date - Dec 25 , 2023 | 10:19 PM
తెలంగాణ వ్యాప్తంగా కరోనా ( Corona ) మహమ్మారి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. రాష్ట్రంలో కేసులు మళ్లీ పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా కరోనా ( Corona ) మహమ్మారి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. రాష్ట్రంలో కేసులు మళ్లీ పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో హైదరాబాద్ నగరంలో 9, కరీంనగర్‌లో ఒక్క కేసు నమోదైంది. ఈ మేరకు సోమవరం నాడు రాష్ట్ర, వైద్యారోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ నుంచి ఒకరు కోలుకున్నారు.
మరో 55 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇంకో 12 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు జేఎన్.1 వేరియంట్ కేసులు నమోదు కాలేదని వైద్యారోగ్య శాఖ సంచాలకులు రవీంద్ర నాయక్ తెలిపారు. ప్రజలు ఎవరూ ఆందోళన పడవద్దని అప్రమత్తంగా ఉండాలని రవీంద్ర నాయక్ సూచించారు. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. జాగ్రత్తలు పాటిస్తేనే కరోనాను మన దరి చేరనీయకుండా తరిమి కొట్టవచ్చని వైద్యారోగ్య శాఖ సంచాలకులు రవీంద్ర నాయక్ ప్రజలకు సూచనలు, సలహాలు అందజేశారు.