Share News

TS NEWS : సోషల్ మీడియాలో యువతిని మోసం చేసిన ఘనుడు

ABN , First Publish Date - 2023-11-16T18:02:01+05:30 IST

సోషల్ మీడియాతో యువతిని ఓ యువకుడు మోసం చేశాడు. ఈ సంఘటనపై ఈ నెల 8వ తేదీ మార్కెట్ పీఎస్‌లో ఒక మహిళ ఫిర్యదు చేసిందని హైదరాబాద్ నార్త్ జోన్ ఏసీపీ రవీందర్ తెలిపారు.

TS NEWS : సోషల్ మీడియాలో యువతిని మోసం చేసిన ఘనుడు

హైదరాబాద్: సోషల్ మీడియాతో యువతిని ఓ యువకుడు మోసం చేశాడు. ఈ సంఘటనపై ఈ నెల 8వ తేదీ మార్కెట్ పీఎస్‌లో ఒక మహిళ ఫిర్యాదు చేసిందని హైదరాబాద్ నార్త్ జోన్ ఏసీపీ రవీందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘మ్యారేజ్ ప్రపోజల్ కోసం మాట్రిమోనిలో బాధిత మహిళ బయో డేటా పెట్టింది. ప్రొఫైల్ చూసి శ్రీనాధ్ అలియాస్ మోహన్‌రెడ్డి అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటానని చాట్ చేశాడు. మూడు నాలుగు రోజుల తర్వాత ఫిజికల్‌గా కలవాలని మహిళకు శ్రీనాధ్ చెప్పాడు. మీరు బంగారం వేసుకొని చీరలో ఫొటో దిగితే చూడాలని యువతికి ప్రపోజల్ పెట్టాడు. శ్రీనాధ్ అలియాస్ మోహన్‌రెడ్డి సికింద్రాబాద్ వచ్చి లాడ్జి తీసుకొని సదరు మహిళను పిలిచాడు. లాడ్జికి వస్తే ఫొటో తీసుకుంటానని బంగారం, చీర తీసుకొని రమ్మని నమ్మించాడు. ఆమె వచ్చిన తర్వాత ఫ్రెష్ అవ్వమని చెప్పి.. ఆమె వాష్ రూమ్‌కి వెళ్లిన తర్వాత ఆమె వెంట బ్యాగ్‌లో తెచ్చుకున్న 27 తులాల బంగారం తీసుకొని పరారయ్యాడు. ఇతని పేరు శ్రీనాధ్ కాదు మోహన్‌రెడ్డి అని దర్యాప్తులో తేలింది. గతంలో కూడా ఇతనిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయి. మాట్రిమోనిలో ప్రొఫైల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. ఈజీ మని కోసం ఈ విధమైన మోసాలకు నిందితుడు తెరలేపాడని పోలీసులు తెలిపారు. నిందితుడు మోహన్‌రెడ్డిపై కల్వకుర్తి, కందుకూరు, మాదాపూర్, చైతన్యపురి, మియపూర్, దిశ పోలీస్ స్టషన్ గుంటూరు పోలీసు స్టేషనలల్లో, కేసులు నమోదయ్యాయి. ఇలాంటి వారిపట్ల అప్రమతంగా ఉండాలి’’ అని ఏసీపీ రవీందర్ సూచించారు.

Updated Date - 2023-11-16T18:02:02+05:30 IST