Delhi Liquor Scam: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరెస్ట్

ABN , First Publish Date - 2023-03-07T10:39:26+05:30 IST

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరొకరిని ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అరెస్ట్ చేశారు. రాత్రి 11 గంటలకు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్ళైని ఈడీ అరెస్టు చేసింది.

Delhi Liquor Scam: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరెస్ట్

ఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణం (Delhi Liquor Scam) కేసులో మరొకరిని ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ (ED) అరెస్ట్ చేశారు. రాత్రి 11 గంటలకు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్ళై (Arun Ramachandra Pillai)ని ఈడీ అరెస్టు చేసింది. మద్యం కుంభకోణంలో అవకతవకలపై ఇటీవల రెండు రోజులపాటు రామచంద్ర పిళ్ళైని ఈడీ ప్రశ్నించింది. అదుపులోకి తీసుకున్నట్లుగా కొద్దిసేపటి క్రితం ఈడీ వర్గాలు వెల్లడించాయి. అరుణ్ పిళ్ళై‌కి చెందిన వట్టినాగులాపల్లిలో రూ .2.2 కోట్ల విలువైన భూమిని కూడా ఈడీ జప్తు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి రామచంద్ర పిళ్లైతో కలిపి ఇప్పటి వరకూ 11 మందిని ఈడీ అరెస్ట్ చేసింది.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్ళైను ఢిల్లీ మద్యంకుంభకోణంలో నిందితుడిగా పేర్కొంది. పలు దఫాలుగా రామచంద్ర పిళ్లై ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన మీదట దర్యాప్తు సంస్థలు కీలక సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో దాఖలు చేసిన చార్జిషీట్లలో అరుణ్ రామచంద్ర పిళ్లై పేరు కూడా ఉంది. ఇప్పటి వరకూ ఈ కేసులో అరెస్టైన వారిలో ఎక్కువగా హైదరాబాద్‌కు చెందిన వారే ఉండటం గమనార్హం. అరుణ్ పిళ్ళై.. ఈ స్కామ్‌లో అభిషేక్ బోయిన్‌పల్లి, సమీర్ మహేంద్రూ, విజయ్ నాయర్ తదితరులకు రామచంద్ర పిళ్లై సహకరించారని ఈడీ భావిస్తోంది. కాగా.. ఈ వరుస అరెస్ట్‌ల నేపథ్యంలో మరోసారి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (kalvakuntla Kavitha) పేరు తెరపైకి వచ్చింది. తదుపరి అరెస్ట్ ఆమెనంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆమె మాజీ ఆడిటర్ బుచ్చిబాబు అరెస్టైన విషయం తెలిసిందే. ఇక ముందు కూడా మరిన్ని అరెస్ట్‌లు ఉండే అవకాశముందని తెలుస్తోంది.

Updated Date - 2023-03-07T10:39:26+05:30 IST