TS GOVT: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు నూతన చైర్మన్, సభ్యుల నియామకం
ABN , First Publish Date - 2023-09-21T21:25:18+05:30 IST
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్(SC and ST Commission)కు నూతన చైర్మన్, సభ్యులను తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) నియమించింది.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్(SC and ST Commission)కు నూతన చైర్మన్, సభ్యులను తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) నియమించింది. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా బక్కి వెంకటయ్య (ఎస్సీ మాల, మెదక్ )ను, సభ్యులుగా శ్రీమతి కుస్రం నీలాదేవి(ఎస్టీ గోండు , ఆదిలాబాద్), రాంబాబు నాయక్ (ఎస్టీ లంబాడా, దేవరకొండ), కొంకటి లక్ష్మీనారాయణ(ఎస్సీ మాదిగ, కరీంనగర్), జిల్లా శంకర్ ( ఎస్సీ మాదిగ, నల్గొండ జిల్లా), రేణికుంట ప్రవీణ్( ఎస్సీ మాదిగ, ఆదిలాబాద్)ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను త్వరలో విడుదల చేయనున్నారు.