CBI Custody: భాస్కర్ రెడ్డి, ఉదయ్‌ల రెండో రోజు ముగిసిన సీబీఐ కస్టడీ
ABN , First Publish Date - 2023-04-20T17:27:28+05:30 IST
హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case)లో వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్‌ల రెండో రోజు సీబీఐ కస్టడీ విచారణ ముగిసింది.
హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case)లో వైఎస్ భాస్కర్ రెడ్డి (Bhaskar Reddy), ఉదయ్ కుమార్ (Uday Kumar)ల రెండో రోజు సీబీఐ కస్టడీ (CBI Custody) విచారణ ముగిసింది. తిరిగి వారిని అధికారులు చంచల్ గూడ జైలు (Chanchal Guda Jail)కు తరలించారు. నిందితులు భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను సీబీఐ అధికారులు గురువారం 6 గంటలపాటు విచారించారు. వివేకానందరెడ్డి హత్య కేసు అంశానికి సంబంధించి దారితీసిన ప్రధాన కారణాలపై సీబీఐ ఆరా తీసింది. ఆర్ధిక లావాదేవీలపై కూడా ప్రశ్నించారు. హత్యకు పన్నిన కుట్ర, సాక్ష్యాధారాలు చేరిపేయడంలో నిందితుల పాత్రపై విచారించారు. నిందితులను విడి విడిగా విచారించారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను ఆరు రోజుల సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతించింది, దీంతో అధికారులు బుధవారం నుంచి విచారిస్తున్నారు. అయితే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే వారిని విచారించాలని, తిరిగి చంచల్ గూడ జైలుకు తరలిచాలని అధికారులకు న్యాయస్థానం ఆదేశించింది. అలాగే న్యాయవాదుల సమక్షంలోనే విచారించాలని కూడా సూచించింది. ఈ నెల 24వ తేదీ వరకు ఆ ఇద్దరినీ సీబీఐ అధికారులు విచారించనున్నారు.