Peddamma Gudi Metro Station: పెద్దమ్మగుడి మెట్రోస్టేషన్ పార్కింగ్ దగ్గర బైక్ పెడితే ఏమైందో చూడండి..!
ABN , First Publish Date - 2023-07-04T11:25:02+05:30 IST
హైదరాబాద్‌లోని షేక్‌పేటకు చెందిన మహ్మద్ తన ద్విచక్ర వాహనాన్ని ఇటీవల పెద్దమ్మగుడి మెట్రోస్టేషన్ వద్ద పార్కింగ్ ఏరియాలో ఉంచారు. మరుసటి రోజు మధ్యాహ్నం వచ్చి చూడగా, వాహనం కనిపించలేదు. చెక్ చేస్తే జూబ్లీహిల్స్ పోలీసులు తీసుకెళ్లారని తేలింది. సర్వీస్ రోడ్డుకు ఇబ్బంది కలిగించారని పేర్కొంటూ రూ.300 జరిమానా విధించారు. పార్కింగ్ స్థలంలో ఉన్న వాహనాన్ని తీసుకెళ్లే హక్కు మీకు ఎక్కడిదంటూ స్టేషన్‌కు వెళ్లి ఎస్సై మహేశ్‌ను ప్రశ్నించాడు.
పార్కింగ్ ప్లేస్‌లో పెట్టినా చలానా
వాహనం టోయింగ్ చేసి తీసుకెళ్లిన పోలీసులు
అకారణంగా చలానా వేశారంటున్న వాహనదారుడు
ఉన్నతాధికారులకు ఫిర్యాదు
హైదరాబాద్ సిటీ (ఆంధ్రజ్యోతి): ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహంతో ఓ వాహనదారుడు అకారణంగా ఇబ్బందులు పడ్డాడు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల వరకు తీసుకెళ్లిన ఆయన న్యాయ పోరాటం చేస్తానంటున్నారు. నగరంలోని షేక్‌పేటకు చెందిన మహ్మద్ తన ద్విచక్ర వాహనాన్ని ఇటీవల పెద్దమ్మగుడి మెట్రోస్టేషన్ వద్ద పార్కింగ్ ఏరియాలో ఉంచారు. మరుసటి రోజు మధ్యాహ్నం వచ్చి చూడగా, వాహనం కనిపించలేదు. చెక్ చేస్తే జూబ్లీహిల్స్ పోలీసులు తీసుకెళ్లారని తేలింది. సర్వీస్ రోడ్డుకు ఇబ్బంది కలిగించారని పేర్కొంటూ రూ.300 జరిమానా విధించారు. పార్కింగ్ స్థలంలో ఉన్న వాహనాన్ని తీసుకెళ్లే హక్కు మీకు ఎక్కడిదంటూ స్టేషన్‌కు వెళ్లి ఎస్సై మహేశ్‌ను ప్రశ్నించాడు. తన వాహనం రహదారిపై పార్క్ చేసి ఉన్న ఆధారాలను, ఫొటోను చూపించాలని కోరాడు. దీనికి ఎస్సై నిరాకరించారు.
దీంతో హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ సుధీర్‌బాబు, డీసీపీ రాహుల్ హెగ్డేకు ఫిర్యాదు చేశారు. ఎస్సైపై చర్యలు తీసుకోవాలని కోరారు. పార్కింగ్ స్థలం నుంచి తన వాహనాన్ని తీసుకెళ్లినందుకు, పనులకు ఆటంకం కలిగించడమే కాకుండా, మానసిక వేదనకు గురి చేసినందుకు.. తన వాహనంపై విధించిన జరిమానాపై వంద రెట్లు నష్ట పరిహారం చెల్లించాలని ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ట్రాఫిక్ పోలీసుల తప్పుడు జరిమానాలపై న్యాయపరంగానూ పోరాడుతానని మహ్మద్ పేర్కొన్నారు.