Bandi Sanjay: కేసీఆర్ పాలనలో ఆడపిల్లల భవిష్యత్‌కు గ్యారంటీ లేదు

ABN , First Publish Date - 2023-02-27T10:45:31+05:30 IST

మెడికో స్టూడెంట్ ప్రీతి మరణ వార్త నుండి కోలుకోకముందే నర్సంపేటలో ఇంజనీరింగ్ విద్యార్థిని రక్షిత ర్యాగింగ్‌కు బలికావడం తీవ్ర దిగ్బ్రాంతి కలిగిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు.

Bandi Sanjay: కేసీఆర్ పాలనలో ఆడపిల్లల భవిష్యత్‌కు గ్యారంటీ లేదు

హైదరాబాద్: మెడికో స్టూడెంట్ ప్రీతి (Medico Preeti) మరణ వార్త నుండి కోలుకోకముందే నర్సంపేటలో ఇంజనీరింగ్ విద్యార్థిని రక్షిత (Engineering student Rakshita) ర్యాగింగ్‌కు బలికావడం తీవ్ర దిగ్బ్రాంతి కలిగిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (BJP Leader Bandi Sanjay) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) పాలనలో ఆడపిల్లల భవిష్యత్‌కు గ్యారంటీ లేదన్నారు. కేసీఆర్ (Telangana CM) కుటుంబ - అవినీతి - నియంత పాలనలో సామాన్యులు బతకలేని దుస్థితి ఏర్పడిందని తెలిపారు. ‘‘ప్రజాస్వామ్యవాదులారా.... మీ మౌనం సమాజానికే అరిష్టం... ఇకనైనా నోరు విప్పండి’’ అంటూ పిలుపునిచ్చారు. కేసీఆర్ (BRS Chief) పాలనలో ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థులు (Students) కళ్లముందే చస్తున్నా స్పందించకపోవడం మానవత్వానికే కళంకమని మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూండా, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడాల్సిన అసవరం అందరిపైనా ఉందని బండి సంజయ్ పేర్కొన్నారు.

యువకుడి వేధింపులు తాళలేక....

కాగా.. ప్రేమోన్మాది వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య ఇంజనీరింగ్ విద్యార్థిని రక్షిత ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన రక్షిత ఓ ఇంజనీరింగ్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతోంది. ఈ క్రమంలో రాహుల్ అనే యువకుడు ప్రేమ పేరుతో రక్షితను వేధింపులకు గురిచేశారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన యువతి వరంగల్‌లోని బంధువుల ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2023-02-27T10:45:32+05:30 IST