Vijayaramarao: బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ మార్పు వార్తలపై మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-07-01T11:53:32+05:30 IST
బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ మార్పు ఆలోచన ఆత్మహత్య సదృశ్యమే అని మాజీమంత్రి విజయరామారావు వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ (BJP Leader Bandi Sanjay) మార్పు ఆలోచన ఆత్మహత్య సదృశ్యమే అని మాజీ మంత్రి విజయరామారావు (Former Minister Vijayaramarao) వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్‌ను మార్చితే బీజేపీలో చేరికలు కాదు.. ఉన్న వారు బయటకు పోవటం ఖాయమన్నారు. బండి సంజయ్ కంటే అధ్యక్షుడిగా బలమైన నేత బీజేపీలో లేరని స్పష్టం చేశారు. జంట నగరాలకే పరిమితమైన బీజేపీని గ్రామగ్రామానికి తీసుకెళ్ళన ఘనత బండి సంజయ్ దే అని కొనియాడారు. బండి సంజయ్ మాదిరి పార్టీ కోసం శ్రమ చేసే బలమైన నేత బీజేపీలో లేరని తెలిపారు. సీఎం కేసీఆర్‌ను ఎదుర్కోవడానికి బండి సంజయ్ చాలని స్వయంగా మోదీ (PM Narendra Modi), అమిత్ షాలు (union Minister Amit shah) బహిరంగ సభలో చెప్పారని గుర్తుచేశారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందన్న అనుమానం ప్రజల్లో ఉన్నమాట వాస్తవమన్నారు. కాళేశ్వం ప్రాజక్టు కేసీఆర్‌కు (Telangana CM KCR)ఏటీఎంలా మారిందన్న బీజేపీ జాతీయ నేతలు చర్యలు మాత్రం తీసుకోలేదని తెలిపారు. బండి సంజయ్‌ను మార్చలనే ఆలోచన ఉంటే హైకమాండ్ పునరాలోంచించుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ పట్ల బీజేపీ అప్రోచ్‌లో మారితే ప్రజలు అనుమానించాల్సి వస్తుందన్నారు. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను బీజేపీలో కొనసాగుతాను అంటూ విజయరామారావు స్పష్టం చేశారు.