Etela Rajender: ధర్నాచౌక్.. కేసీఆర్ అబ్బ జాగీరు కాదు
ABN , First Publish Date - 2023-08-12T13:30:57+05:30 IST
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (CM KCR) బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (BJP MLA Etela Rajender) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ధర్నాచౌక్.. కేసీఆర్ అబ్బ జాగీరు కాదని హెచ్చరించారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ మాదిరి సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. డబుల్ బెడ్రూం ఇళ్ళ పేరుతో కేసీఆర్ పేదల నోట్లో మట్టి కొట్టారన్నారు. నిరుద్యోగుల డిమాండ్ మేరకు గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో అపార్ట్‌మెంట్లు వద్దని తుమ్మల నాగేశ్వరరావు, హరీష్ రావు, కడియం శ్రీహరి, నాలాంటోళ్ళం చెప్పినా కేసీఆర్ వినలేదన్నారు. తొమ్మిదేళ్ళ కాలంలో పేదల ఇళ్ళకు కేసీఆర్ సర్కార్ రూ.600 కోట్లు మాత్రమే కేటాయించిందని ఎమ్మెల్యే తెలిపారు.
కట్టిన ఇళ్ళను పేదలకు పంచే ధైర్యం కేసీఆర్ సర్కార్‌కు లేదన్నారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలో మాత్రమే డబుల్ బెడ్‌రూం ఇళ్ళు కట్టారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌కు ఒక న్యాయం.. పేదలకు మరొక న్యాయం నడవదన్నారు. కేసీఆర్‌కు మరొక మూడు నెలల సమయం మాత్రమే ఉందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక.. పేదలు ఇళ్లు కట్టుకోవటానికి రూ.5లక్షల సాయం చేస్తామని హామీ ఇచ్చారు. మళ్ళీ కేసీఆర్‌కు అవకాశం ఇస్తే.. పేదల బతుకులు ఆగమే అని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ చుట్టుప్రక్కల ఒక్క గజం భూమి అయినా.. పేదలకు ఇచ్చే ధైర్యం కేసీఆర్‌కు ఉందా అని ప్రశ్నించారు. బీజేపీని ఆశీర్వదిస్తే.. పేదలకు డబుల్ ఇళ్ళ కల నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే ధర్నాచౌక్‌ను ఎత్తివేసిన చరిత్ర కేసీఆర్ ది అని ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చేశారు.