BJP Highcommand: బండి సంజయ్ అరెస్ట్‌పై బీజేపీ హైకమాండ్ ఆరా..
ABN , First Publish Date - 2023-04-05T12:47:08+05:30 IST
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌తో రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణ చోటు చేసుకుంది. బండి అరెస్ట్ అక్రమం అంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (BJP Leader Bandi Sanjay) అరెస్ట్‌తో రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణ చోటు చేసుకుంది. బండి అరెస్ట్ అక్రమం అంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. అటు బండి సంజయ్ అరెస్ట్‌పై బీజేపీ హైకమాండ్ స్పందించింది. అరెస్ట్‌ను బీజేపీ హైకమాండ్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బండి సంజయ్ అరెస్ట్‌పై జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (BJP National President JP Nadda) ఆరా తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యనేతలతో నడ్డా ఫోన్‌లో మాట్టాడారు. న్యాయపరమైన అవకాశాలను పరిశీలించాల్సిందిగా ఆయన సూచించారు. సంజయ్ అరెస్ట్‌పై కేంద్రమంత్రి అమిత్‌షాతో నడ్డా చర్చించినట్లు సమాచారం.
మరోవైపు టెన్త్ హిందీ పేపర్ వైరల్ కేసులో బండి సంజయ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు యాద్రాద్రి జిల్లా బొమ్మలరామారం పోలీస్‌స్టేషన్‌కు గత అర్ధరాత్రి తరలించారు. ఈ రోజు ఉదయం బొమ్మలరామారం పోలీస్టేషన్‌ను బండిని తరలించిన పోలీసులు ఆయనను ఎక్కడకు తీసుకువెళ్తున్నారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. వాహనాలను మారుస్తూ బండి సంజయ్‌ను తిప్పుతున్న పరిస్థితి. జనగామ జిల్లా పెంబర్తి వద్దకు చేరిన బండి సంజయ్ కాన్వాయ్‌ను బీజేపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు లాఠీచార్జ్ చేసి బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టారు. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. అక్కడి నుంచి వేరే వాహనంలో బండి సంజయ్‌ను పాలకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు జరిగిన అనంతరం ప్రభుత్వాస్పత్రి నుంచి కూడా బండి సంజయ్‌ను తీసుకెళ్లిపోయారు. అయితే బీజేపీ నేతను ఎక్కడికి తీసుకెళ్తున్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.