Bandi Sanjay: విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపటానికే పరీక్షా పే చర్చ
ABN , First Publish Date - 2023-01-27T13:52:58+05:30 IST
విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించి ఆత్మవిశ్వాసం నింపటానికే పరీక్షా పే చర్చా కార్యక్రమమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు.
హైదరాబాద్: విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించి ఆత్మవిశ్వాసం నింపటానికే పరీక్షా పే చర్చా కార్యక్రమమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (BJP State President Bandi Sanjay) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 600 పాఠశాల్లో పరీక్ష పే చర్చా కార్యక్రమం జరుగుతోందన్నారు. ప్రధాని మోదీ ప్రసంగం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిందన్నారు. కొన్ని కార్పోరేట్ పాఠశాలలు ర్యాంకుల కోసం విద్యార్థులను రాచి రంపాన పెడ్తున్నాయని మండిపడ్డారు. కొన్ని కార్పోరేట్ స్కూల్స్ ర్యాంకులను కొంటున్నాయని ఆరోపించారు. సామాజిక స్పృహ లేని విద్య... మెదటి ర్యాంకు వచ్చినా అవసరం లేదన్నారు. మక్ కీ బాత్ కార్యక్రమం స్పూర్తితో సక్సెస్ అయిన విద్యార్థులు లక్షల మంది ఉన్నారని చెప్పుకొచ్చారు. దేశానికి ఉపయోగపడే స్థాయికి విద్యార్థులు ఎదగాలని సూచించారు. ర్యాంకుల కోసం తల్లిదండ్రులు పిల్లలని చదించవద్దని... సమాజానికి ఉపయోగపడని జ్ఞానం వ్యర్థమన్నారు. విద్యార్థులను తీర్చిదిద్ధటంలో ఉపాధ్యాయుల కృషి గొప్పదని బండి సంజయ్ కొనియాడారు.