Boora Narsaiah Goud : జేఎన్- 1 కొవిడ్ వేరియంట్‌పై ఆందోళన అవసరం లేదు
ABN , Publish Date - Dec 19 , 2023 | 04:06 PM
జేఎన్- 1 కొవిడ్ వేరియంట్‌పై తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీజేపీ సీనియర్ నేత, డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ( Boora Narsaiah Goud ) తెలిపారు. మంగళవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘దగ్గు, జలుబు, జ్వరం ఉన్న వాళ్లు ఇంటికే పరిమితం కావాలని సూచించారు. కొత్త వేరియంట్‌పై ఆందోళన అవసరం లేదు’’ అని బూర నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు.
హైదరాబాద్: జేఎన్- 1 కొవిడ్ వేరియంట్‌పై తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీజేపీ సీనియర్ నేత, డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ( Boora Narsaiah Goud ) తెలిపారు. మంగళవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘దగ్గు, జలుబు, జ్వరం ఉన్న వాళ్లు ఇంటికే పరిమితం కావాలని సూచించారు. కొత్త వేరియంట్‌పై ఆందోళన అవసరం లేదు. అప్రమత్తంగా ఉండాలి. గుంపుల్లోకి వెళ్లేటప్పుడు .. ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కొత్త వేరియంట్‌ను తట్టుకునే శక్తి ఉంటోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గైడ్ లైన్స్‌ను ప్రజలు తప్పనిసరిగా పాటించాలి. పార్లమెంట్‌లో కలర్ స్ప్రే ఘటన వెనుక కుట్ర కోణముంది. మోదీ ప్రభుత్వాన్ని చులకన చేయటానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారు. నిజాలు బయటకు రాకూడదన్న భయంతో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌లో రభస సృష్టిస్టోంది. పాత్రధారులు, కుట్రధారులు ఎవరనేది త్వరలో తెలుస్తోంది. దర్యాప్తు సంస్థలకు ప్రతిపక్షాలు సమయం ఇవ్వాలి. పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు ఆందోళనలు చేయడం సరైంది కాదు’’ అని డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు.